Vijayasaireddy: జగన్ తో నాకున్న విభేదాలు అవే.. ఎట్టకేలకు నోరు విప్పిన విజయసాయి

కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిగిన మెట్లపై వాళ్ళు పైకి ఎక్కారన్నారు.

author-image
By Nikhil
New Update

కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిగిన మెట్లపై వాళ్ళు పైకి ఎక్కారన్నారు. ఇందులో చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారన్నారు. తాను చిత్తశుద్ధితో వైసీపీలో పనిచేశానని.. జగన్ బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. జగన్ చుట్టూ ఉన్న కొటరీ నుంచి బయట పడిన రోజే ఆయనకు భవిష్యత్ ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, ప్రజలు, పార్టీ నష్టపోతుందన్నారు. కొటరీ వల్లనే జగన్ కు తాను  దూరమయ్యానన్నారు.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: పోసానికి పెద్ద షాక్‌.. విడుదలకు బ్రేక్‌!

నాయకుడే మారాడు..

జగన్ మనసులో స్థానం లేదు అని వైసీపీని వీడుతున్నట్లు నేరుగా ఆయనకే చెప్పానన్నారు. భయం అనేది తన బ్లడ్ లోనే లేదన్నారు. ఒకప్పుడు నాయకుడిపై భక్తి, ప్రేమ ఉందన్నారు. కానీ ఇప్పుడు దేవుడిపై మాత్రమే ఉందన్నారు. తాను పడిన అవమానాలు, కష్టాలు వైసీపీలో ఇంకెవ్వరూ పడలేదన్నారు. ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసంతో బతికానన్నారు. తనను భయపడ్డానని.. ప్రలోభాలకు లొంగాను అని.. విశ్వాసనీయత కొల్పోయానని అన్నారన్నారు. తాను మారలేదని.. నాయకుడు మాత్రమే మారాడని అన్నారు. 
ఇది కూడా చదవండి: వివేకా హత్య జరిగిన రోజు అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు!

తాను వైసీపీకి మళ్లీ తిరిగి వెళ్లడం ఉండదన్నారు. కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసు విచారణకు సంబంధించి ఏపీ సీఐడీ ఈ రోజు విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో విజయసాయిని విచారించింది సీఐడీ. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీపై సీఎం కీలక ప్రకటన!

టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు.

New Update
Telangana : డీఎస్సీ దరఖాస్తులకు నేడే చివరి రోజు!

CM Chandrababu key statement on AP Mega DSC

AP DSC: టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెంలో ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు. అలాగే మే నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తాం. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీలో కంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

16 వేల 347 టీచర్ పోస్టులు..

ఈ మేరకు ఎన్నికల హామీలో భాగంగా తమ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మార్చిలోనే రిలీజ్ చేయాల్సినప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆలస్యం అయిందని, ఈ కోడ్ ముగియగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పిన అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

'మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ అకాడమిక్ మొదలయ్యే నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. నియామకాల కేటాయింపులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆర్డినెన్స్ జారీ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

mega-dsc | cm-chandrababu | april | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment