ఆంధ్రప్రదేశ్ School Holiday : విద్యార్ధులకు ఆలర్ట్.. ఈ రోజు సెలవు...!! ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ముఖ్యగమనిక. నేడు ఏపీ వ్యాప్తంగా పాఠశాలలకు సర్కార్ సెలవు ప్రకటించింది. ఏపీలో మిచైంగ్ తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. By Bhoomi 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి డెలివరీ పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సతీమణి కరుణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి వాగ్దేవి, ఆమె బృందం సురక్షితంగా ప్రసవం కావడానికి అన్ని చర్యలు తీసుకోవడంతో సేఫ్ గా డెలివరీ అయ్యారు. By Jyoshna Sappogula 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయనగరం Train Accidents: 5 నెలలు.. 3 ఘోర రైళ్ల ప్రమాదాలు.. కారణం మాత్రం ఒక్కటే! నిర్లక్ష్యానికి వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జూన్లో జరిగిన ఒడిశా రైళ్ల ప్రమాదం నుంచి నిన్న జరిగిన విజయనగరం రెండు రైళ్ల ఢీకొన్న ప్రమాదం వరకు అడుగుఅడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ అక్టోబర్ 11న జరిగిన బీహార్ ట్రైన్ యాక్సిడెంట్లోనూ రైల్వే ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఉందని తేలింది. ఒడిశా ఘటనలో 296మంది, బీహార్ ఘటనలో నలుగురు, విజయనగరం ఘటనలో ఇప్పటివరకు 14మంది ప్రాణాలు విడిచారు. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది..జగన్ ఆసక్తికర ట్వీట్.! విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గత రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనకు తీవ్రమైన వేదన కలిగించిందని వెల్లడించారు. నడుస్తున్న ఓ రైలు ఆగివున్న మరో రైలును ఢీకొట్టిందని, ఆ రెండు రైళ్లూ ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ భయానక రైలు ప్రమాద ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. By Jyoshna Sappogula 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇకనైనా రైల్వే శాఖ నిద్ర నుంచి మేల్కొంటుందా..ప్రతిపక్షాల ఫైర్ ఏపీలో జరిగిన రైలు ప్రమాదం గురించి ప్రతిపక్షాల నేతలు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. ఇప్పటికైనా రైల్వేవ్యవస్థ నిద్ర నుంచి మేల్కొని.. ఇక నుంచైనా ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Train Accident: ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకి పెరిగింది. ఇక పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గయాపడ్డారు. మరికొందరు రైలు బోగీల్లో చిక్కుకుపోయారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఫోన్ ఆర్డర్ పెడితే.. పార్సిల్ లో ఇంటికి ఏం వచ్చిందో తెలుసా? మహమ్మద్ బాషా అనే యువకుడు అమెజాన్ దసరా ఆఫర్ల సందర్భంగా రూ. 6 వేలకు ఐటెల్ ఏ 60 ఎస్ ఫోన్ను ఆర్డర్ చేశాడు. అయితే.. ఆ పార్సిల్ లోపల రెండు రాళ్లు వచ్చాయి. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. By Bhavana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు! శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఓ ముఖ్య సూచన చేసింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు వాహనాలకు ఎలాంటి అలంకరణలు చేయవద్దని ముందుగానే హెచ్చరించింది. చాలా మంది భక్తులు తమ వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూల దండలతో అలంకరణ చేస్తారు.ఈ క్రమంలోనే వాహనాలకు ఎలాంటి అలంకరణలు వద్దని..అలా చేయడం వల్ల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDLP Boycott Assembly: టీడీఎల్పీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలపై తెలుగుదేశం శాసనసభా పక్షం(TDLP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి(సోమవారం) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీడీఎల్పీ ఒక ప్రకటన విడుదల చేసింది. By Shiva.K 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn