/rtv/media/media_files/2025/03/30/0A6vFiqfw0NE52ayn3MB.jpg)
Srisailam
Srisaila Devasthanam : ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 31 వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో శ్రీగిరులు మారుమోగుతున్నాయి. ఉగాది మహోత్సవాలలో భాగంగా శ్రీస్వామి అమ్మవారికి రధోత్సవం నిర్వహించారు. రధోత్సవంలో పాల్గొన్న వేలాదిమంది కన్నడ భక్తులు పాల్గొన్నారు. రధోత్సవంలో ఆశీనులై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్ర పురవిధుల్లో శ్రీస్వామి అమ్మవారి రధోత్సవం కన్నులపండువగా కొనసాగింది. రథోత్సవం శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధ రామ శివాచార్య స్వామీజీ, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
రథోత్సవం ముగియడంతో కన్నడ భక్తులు శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. వేలాది వాహనాల్లో సొంత ప్రాంతాలకు ప్రయాణమైన కన్నడ భక్తులతో రోడ్లన్ని నిండిపోయాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు భారీ సంఖ్యలో వాహనాలు కదులుతున్నాయి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసుల పర్యవేక్షిస్తున్నారు.
శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను క్రమబద్ధంగా పంపేందుకు దోర్నాల పోలీసులు సిద్ధమయ్యారు.
ఇది కూడా చూడండి: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
ఇది కూడా చదవండి: మోకాలి నొప్పిని తగ్గించే అద్భుతమైన డ్రింక్స్ ఇవే