TTD: టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అడిగినన్ని లడ్డూలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్న లడ్డూలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లడ్డూ పోటు సిబ్బంది నియామకంపై ఫోకస్ పెట్టింది.

New Update
TTD 2

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు రెడీ అయ్యింది. ఇకపై శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ కసరత్తులు మొదలు పెట్టింది. అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి రెడీ అవుతుంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 వేల చిన్న లడ్డూలతో పాటుగా ఆరు వేల పెద్ద లడ్డూలు (కళ్యాణం లడ్డూ), 3,500 వడలు తయారు చేస్తోంది. లడ్డూ ప్రసాదాలను తిరుమలతో పాటుగా తిరుపతిలోని స్థానిక ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, అమరావతి, కడప ఒంటిమిట్ట ఆలయంలో విక్రయిస్తున్నారు.

Also Read: Lokesh: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి మధ్యాహ్నా భోజనం

తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రతి భక్తునికి ఒక చిన్న లడ్డూను ఉచితంగా ఇస్తారు. తిరుమలలో రోజుకు సుమారు 70 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఉచిత లడ్డూలే 70 వేలు ఇవ్వాలి.. వీటితోపాటుగా భక్తులు అదనంగా శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు ఎక్స్‌ ట్రా లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు. ఇక వారాంతం, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూ ప్రసాదాలకు భారీ డిమాండ్ ఉంటుంది. 

Also Read: ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే!

ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ అదనంగా మరో 50వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కానివారిని కూడా నియమించాలని భావిస్తున్నారు.

Also Read: AP: అయ్యప్ప భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు!

తిరుమలలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 270 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి. 

Also Read: AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్‌ వేటు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు