శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

వచ్చే ఏడాది 2025 మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీడీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల టికెట్లను విడుదల చేస్తోంది.

New Update
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి అక్కడ కూడా టికెట్‌ కౌంటర్‌!

తిరుమల శ్రీవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. శ్రీవారి దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యం కోసం ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీడీడీ రేపు విడుదల చేయనుంది. వచ్చే ఏడాది 2025 మార్చి నెలకి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల కోసం రేపు ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. 

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

వర్చువల్ సేవా టికెట్లు..

అలాగే లక్కీడీప్ డేటా కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. అదే వర్చువల్ సేవా టికెట్లను కూడా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బుక్ చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు..

డిసెంబర్ 23వ తేదీన ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి..

డిసెంబర్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు వచ్చే ఏడాది మార్చి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి, తిరుమలలో అద్దె గదుల బుకింగ్‌‌ను విడుదల చేయనున్నారు. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు. ఇవన్ని కూడా టీటీడీ వెబ్‌‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాలి. 

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!

మే, జూన్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.

New Update
ttd

ttd

వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రకటించారు.

Also  Read:  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే, జూన్‌ రెండు నెలలపాటు వేసవి సెలవుల వల్ల కుటుంబాలతో శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా.. దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించరాదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

Also Read: BRS Silver Jubilee : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా...అధికారం నుంచి ప్రతిపక్షంగా.. బీఆర్‌ఎస్‌ గెలుపు ఓటముల 25 ఏండ్ల ప్రస్థానం

‘‘మే, జూన్ నెలల్లో వేసవి సెలవులుతో పాటు అన్ని పరీక్ష ఫలితాలు కూడా వెల్లడి కావడంతో తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు" ఆయన ప్రకటించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Also Read: 🔴Live News Updates: ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్‌ యాత్ర.. కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రకటన

Also Read: Vizianagaram : చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది గుద్ది చంపిన కొడుకు!

ttd | tirumala | summer | holidays | rush | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment