తిరుపతి లడ్డూ వివాదం వేళ.. షారుఖ్ డిక్లరేషన్ ఫామ్ వైరల్! తిరుపతి లడ్డూ వివాదం వేళ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ ఫామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్యమతస్థుడైన షారుఖ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారని, క్రైస్తవుడైన జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. By srinivas 30 Sep 2024 | నవీకరించబడింది పై 30 Sep 2024 16:34 IST in ఆంధ్రప్రదేశ్ సినిమా New Update షేర్ చేయండి Tirupati: తిరుపతి లడ్డూ వివాదం వేళ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ డాక్యూమెంట్ మరోసారి చర్చనీయాంశమైంది. జగన్ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయగా.. జగన్ తిరుమలకు రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలంటూ హిందూ సంఘాలు, కూటమి ప్రభుత్వ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అసలు డిక్లరేషన్ ఏంటి? తిరుమలకు వెళ్లాలంటే ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి. నటుడు షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ లో ఏముంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముస్లిం అయినా తిరుమలపై నమ్మకం.. ఈ మేరకు అన్యమతస్థులెవరైనా తిరుపతికి వెళ్లాలంటే డిక్లరేషన్ ఫామ్ తప్పనిసరి. ఇతర మతస్థులు ఎవరైనా తమకు వేంకటేశ్వరుడిపై నమ్మకం ఉందంటే దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగానే గతంలో అబ్దుల కలాం, షారుఖ్ కూడా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారు. 'నేను ముస్లిం. కానీ నాకు శ్రీ వేంకటేశ్వరస్వామిపై కూడా నమ్మకం ఉంది. అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతివ్వాలి' అని కోరుతూ డిక్లరేషన్‌పై షారుఖ్ సంతకం చేశారు. దీంతో క్రైస్తవుడైన జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వట్లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. #sharukh-khan #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి