TDP:టీడీపీ ఎమ్మెల్యేలకు పవర్‌ లేదు.. ఆ రెండు ఇంకా వైసీపీ చేతుల్లోనే..?

అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. టీడీపీ శ్రేణుల పరిస్థితి మరీ విచిత్రంగా మారిందని పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
chadalavada

Ap Tdp: ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు కీలక టీడీపీ నేతలతో పాటు దాదాపు ప్రతీ జిల్లాల్లోనూ ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఇబ్బందులు పడ్డామని చెప్పుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల చెప్పుచేతల్లో ఉన్న పోలీసులు తమను టార్గెట్ చేశారని వాపోయేవారు.

Also Read:  బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!

కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు, నేతలు సొంత పార్టీ ప్రభుత్వం వచ్చినా తమ పరిస్ధితి మారలేదని వాపోతున్నారు. 

Also Read:  ఇజ్రాయెల్‌ ప్యాంట్‌ తడిసిపోతుందిగా.. కారణం ఇదే!

వైసీపీ హయాంలోనే..

ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలోనే ధైర్యంగా ఉన్నామని సెటైర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: భారత్ దెబ్బ..మాల్దీవులు అబ్బా..డబ్బుల్లేక అధ్యక్షుడీ జీతంలో కోత

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. టీడీపీ శ్రేణుల పరిస్థితి మరీ విచిత్రంగా మారిందని ఆయన వాపోయారు. 

Also Read: జగన్‌ బెయిల్‌ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్!

తాజాగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన పార్టీ నేతల భేటీలో అరవిందబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.  కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు. 

Also Read:  ప్రైవేట్‌ స్కూళ్లో గ్యాస్‌ లీకేజీ...30 మంది విద్యార్థులు..!

ఇప్పటికీ ఇసుక, మద్యం వైసీపీ మాఫియా చేతుల్లోనే ఉందని, ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారని, కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అరవిందబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: మాజీ హోంమంత్రి సోదరుడు అని చెప్పుకుంటూ.. ఏం చేశాడంటే?

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదని తాజా ఘటనతో నిరూపితమైంది.

Also Read: ఇరాన్‌ సైనిక బలగాలపై ఇజ్రాయెల్‌ దాడులు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు