హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ టీడీపీ ట్వీట్.. వైసీపీ కౌంటర్!

AP: జగన్‌ను విమర్శిస్తూ ఎక్స్‌లో టీడీపీ మరో పోస్ట్ చేసింది. హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ ట్వీట్ చేసింది. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్ అని సెటైర్లు వేసింది.

New Update
JAGAN TDP

TDP Vs  YCP: ఏపీలో రాజకీయాలు ట్విట్టర్‌లో నడుస్తున్నాయి. అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీ నడుమ విమర్శల దాడి యుద్ధంలా సాగుతోంది. మాజీ సీఎం జగన్ (YS Jagan) టార్గెట్ గా టీడీపీ పోస్టులు పెడుతున్న క్రమంలో దానికి కౌంటర్ గా వైసీపీ చంద్రబాబు, లోకేష్ పై పోస్టులు పెడుతోంది. తాజాగా టీడీపీ మరో సంచలన పోస్ట్ పెట్టింది. హ్యాపీ "కోడి కత్తి డే" (Kodi Kathi)  జగన్ అంటూ ట్వీట్ చేసింది." PS : తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్.." అని పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: దీపావళి బోనస్.. నేడు అకౌంట్లో డబ్బు జమ!

శాడిస్ట్ అంటూ వైసీపీ కౌంటర్...

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!

మాజీ సీఎం జగన్ పై టీడీపీ చేసిన ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్(X)లో... "ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా…!, మన రాష్ట్రంలో కోడికత్తి లాంటి పదునైన ఆయుధంతో ఎవరిపైనైనా దాడిచేసినా అది నేరం కాదని 
టీడీపీఅధికారపార్టీ ప్రకటించిందండోయ్‌. ఆ దాడికారణంగా గాయమైనా, చికిత్సకోసం ఆస్పత్రిలో చేరినా.. దాన్ని పెద్దనేరంగా చూడాల్సిన అవసరంలేదని స్వయంగా శాడిస్ట్ చంద్రబాబు పార్టీ ప్రకటించిందండోయ్‌.

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

చంద్రబాబు పార్టీ ఇచ్చిన అద్భుతమైన అవకాశంగా దీన్ని పేర్కొంటూ కోడికత్తులతో దాడులు చేసేవారు కోడికత్తికి పాలాభిషేకం చేస్తూ, తెలుగుదేశంపార్టీ కార్యాలయాలముందు జెండా ఆవిష్కరణలు చేయాలని అధికార పార్టీ వారు పిలుపు నిచ్చారండోయ్. ఇకపై పోలీసు వారు కూడా వీటిని పట్టించుకోరని, కోడికత్తి గ్యాంగులకు చంద్రబాబు అధికార పార్టీ ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌గా గమనించాలని టీడీపీ వారు చెప్పదలుచుకున్నారహో" అని పోస్ట్ చేసింది.

కాగా ఆస్తి విషయంపై ఇటీవల షర్మిల జగన్ కు బాధతో లేఖ రాసిందంటూ టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. దానికి కౌంటర్ గా వైసీపీ ఒక ఛానెల్ అధినేత, డ్రగ్స్ కేసులో  పట్టుబడ్డ అతనికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారంటూ వైసీపీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ట్విట్టర్ వేదికగా విమర్శలు దాడులు కొనసాగిస్తున్నాయి టీడీపీ, వైసీపీ పార్టీలు.

ఇది కూడా చదవండి: ఆధార్ కార్డు చెల్లదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

#ycp #ys-jagan #tdp
Advertisment
Advertisment
తాజా కథనాలు