Buddha Venkanna: విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయవాడ కమిషనరేట్ లో కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడు కి కులం అంటగడుతున్నారని ఫైర్ అయ్యారు. అన్నీ కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందని అన్నారు. అలాంటిది ముఖ్యమంత్రి కి కులాన్ని అంటగట్టడం కరెక్ట్ కాదని చెప్పారు.
ఇది కూడా చదవండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు
ఇది కూడా చూడండి: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలని....
పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉంది అంటాడని.. చావకుండా బతికుంటే లోపల వేస్తాం అని విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై విజయవాడ సీపీ కి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చామని అన్నారు. ఈ విషయం లో విజయ్ సాయి రెడ్డి ని అరెస్ట్ చెయ్యాలని కోరినట్లు చెప్పారు. నీ పరువేంతుందో నీ పరప్పతూ ఎంతుందో నిరూపించుకో విజయ్ సాయి రెడ్డి అని సవాల్ చేశారు.
ఇది కూడా చదవండి: BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఫోన్ సీజ్!
వైసీపీ పార్టీ టైటానిక్ షిప్ లో మునిగిపోయింది ఎంత లేపుదాం అన్న లేవడం లేదని చురకలు అంటించారు. సీపీ కి మొత్తం వివరించి చెప్పమని.. ఇవాళ సీఎం ని అన్నాడు రేపు పీఎం ని అంటాడని అన్నారు. విజయ సాయి రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే తాను కోర్టుకు కూడా వెళ్లడానికి సిద్ధం అని అన్నారు.
ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!