AP: రైలు ప్రయాణికులకు గమనిక.. ఈ రైళ్లు రూట్ మార్చుకున్నాయి! గుంతకల్లు డివిజిన్ పరిధిలో డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పూరి-యశ్వంతపూర్ గరీబ్ రథ్ , హౌరా-యశ్వంతపూర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. By Bhavana 02 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Trains: సౌత్‌సెంట్రల్ రైల్వే ఏపీ రైలు ప్రయాణికులకు ఓ ముఖ్యవిషయాన్ని చెప్పింది. గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని సిమెంట్ నగర్-కృష్ణమ్మ కోన సెక్షన్‌లో, పాణ్యం స్టేషన్ల దగ్గర డబ్లింగ్ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కారణంగా గుంతకల్లు, గుత్తి మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. Also Read: UP:కాశీ ఆలయంలో కేక్ కట్ చేసిన మోడల్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు పూరి-యశ్వంతపూర్ గరీబ్ రథ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ను డిసెంబరు 6న.. యశ్వంత్‌పూర్-పూరి ను డిసెంబరు 7న డోన్ స్టేషన్ మీదుగా కాకుండా నంద్యాల, ఎర్రగుంట్ల, గుత్తి ఫోర్ట్, అనంతపురం మీదుగా నడపనున్నట్లు తెలిపారు. Also Read: Mulugu: ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే..వాజేడు ఎస్సై ఆత్మహత్య! డిసెంబరు 4, 11 తేదీల్లో.. హౌరా-యశ్వంతపూర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును.. యశ్వంత్‌పూర్-హౌరా రైలును డిసెంబరు 6, 13 తేదీల్లో గుత్తి-డోన్ సెక్షన్ మీదుగా కాకుండా అనంతపురం, గుత్తి ఫోర్ట్, ఎర్రగుంట్ల, నంద్యాల స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటనలో ప్రకటించారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. Also Read: AP: ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్ ఎమోషనల్ ట్వీట్ మరోవైపు రైల్వే ఏసీ కోచ్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసే బెడ్‌పీట్లు, పిల్లో కవర్స్, టవల్స్ ను ఏ రోజుకు ఆ రోజే శుభ్రం చేసి అందిస్తామని అధికారులు చెప్పారు. రైల్వే కోచ్‌లో తిరుపతి నుంచి అందిస్తున్న బెడ్ షీట్లతో పాటు పిల్లో కవర్స్, టవల్స్ శుభ్రంగా లేవని, వారం రోజులకు ఒకసారి మార్పు చేస్తున్నారంటూ కొందరు ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సూచనల మేరకు పలువురు అధికారులు తిరుపతిలోని చింతలచేనులో రైల్వేకి చెందిన మెకనైజ్డ్ ల్యాండ్రీని అధికారులు పరిశీలించారు. అక్కడి సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. Also Read: US: బైడెన్ సంచలన నిర్ణయం..కొడుకుకి క్షమాభిక్ష సికింద్రాబాద్‌లో రోజుకు 2 టన్నులు, కాచిగూడలో 12 టన్నుల,తిరుపతిలో 2.5 టన్నులు, కాకినాడలో 4 టన్నులు, విజయవాడలో 1.5 టన్నులు కెపాసిటీతో కూడిన లాండ్రీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్, కాచిగూడలో 48 టన్నుల కెపాసిటీ లాండ్రీని అందుబాటులోకి తీసుకునిరానున్నారు. అంతేకాదు విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, గుంటూరులో 10 టన్నుల కెపాసిటీ లాండ్రీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి