Tirumala Laddu : శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్‌ నియామకం..

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యిపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్‌ సభ్యులుగా డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, ఎస్పీ హర్షవర్దన్‌ రాజు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను నియమించింది. 

New Update

Tirupati : తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యిపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్‌ సభ్యులుగా విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను నియమించింది. 

తిరుపతి శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ ఇటీవల సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి విచారణ చేసి వాస్తవాలు తేల్చాలని భక్తులు కోరుతున్నారు. నిజంగా కల్తీ జరిగినట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు టీటీటీ ఆలయశుద్ధి సైతం చేసింది. 

Also Read :  టైఫాయిడ్‌ మందులకు కూడా ఎందుకు తగ్గడం లేదు?

Advertisment
Advertisment
తాజా కథనాలు