రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అనుమానాలు నెలకొన్నాయి. ఆయన్ను ఓ రెడ్ కారు ఢీ కొట్టిందనే ప్రచారం జరుగుతోందని.. ప్రెస్‌మీట్‌లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ నరసింహ కిశోర్. --కారు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పాస్టర్ మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరగనుంది.
Also read : షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు
అనుమానస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం
రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. ఆయన ముఖం, పెదాలపై గాయాలు కనిపించడంతో ఎవరైనా ఆయన్ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్‌ను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఆరోపణ వస్తున్నాయి. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ మృతి వెనుక ఉన్న కారణాలు తెలపాలని పాస్టర్లు కోరుతున్నారు. మరోవైపు ప్రవీణ్ మృతదేహానికి అధికారులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం పూర్తిచేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య మృత దేహాన్ని అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించారు.
పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోలో ప్రకారం.హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై వస్తున్న ప్రవీణ్ సోమవారం రాత్రి 11 గంటల 31 నిమిషాలకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేటు దాటారు. ఆ తర్వాత 11 గంటల 42 నిమిషాలకు బుల్లెట్ నయారా పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. (ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 10-11 కిలో మీటర్లు) సరిగ్గా బంకుకు ఎదురుగా రోడ్డుపై నుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్ బుల్లెట్‌తో సహా పడిపోయారు. ఏం జరిగిందో అన్నది పోలీసులు అనుమానిస్తున్నారు.
Also read : Jagga Reddy : ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..!