/rtv/media/media_files/2025/03/04/rB8nu6NTxkT8FXm6Jqz5.jpg)
Posani Krishna Murali
Posani Krishna Murali : వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు ఇప్పట్లో తేలేలా లేవు. రోజుకో పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి ని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. ఈనేపథ్యంలో.. మంగళవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలుకు చేరుకొని పోసానిని అప్పగించాలని జైలు అధికారులను కోరారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకెళ్లారు.
Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పిటీ వారెంట్ పై ఆదోని లో నమోదు అయినా కేసు మీద గుంటూరు జైలు అధికారులను సంప్రదించిన ఆదోని త్రీ టౌన్ పోలీసులు. ఆయనను రాత్రికి ఆదోని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ స్థానిక మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోతే కర్నూల్లో న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశం ఉందిజ. పవన్ కళ్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేన ఆదోని అధ్యక్షుడు రేణు వర్మ ఫిర్యాదుపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేశారు. పోసానిపై గతేడాది నవంబర్ 14న ఫిర్యాదు చేయడంతో, FIR NO. 119/ 2024 పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: చిరుత, సింహం పిల్లలతో ప్రధాని మోదీ.. వీడియో వైరల్
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన
పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో పాటు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపైనా పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా నరసరావుపేట టూ టౌన్ సిఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించేందుకు పోలీసులు వచ్చారు. కానీ అదే సమయంలో అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు కూడా పోసాని కోసం పీటీ వారెంట్లతో వచ్చారు. దీంతో పోసాని కృష్ణమురళికి ఏపీ యాత్ర తప్పేలా లేదని వాపోతున్నారు. ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో.. పీటీ వారెంట్‌లపై ఆయన్ను ఆయా స్టేషన్‌లకు తీసుకెళ్లబోతున్నారు. ఇంకా చాలా చోట్ల వారెంట్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..
Also Read: Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!