/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లినందుకు సస్పెన్షన్ వేటు విధించింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మందుస్తు అనుమతులు లేకుండా విహార యాత్రల ఆరోపణలపై విచారించేందుకు కమిటీని కూడా నియమించింది.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
మాజీ ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెండ్..
— RTV (@RTVnewsnetwork) March 2, 2025
సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. #IPSsunilKumar #AndhraPradesh #RTV pic.twitter.com/fuaPXoLPbB
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత..
బిహార్ (Bihar) క్యాడర్ కు చెందిన సునీల్‌నాయక్ గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ డీఐజీగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీహార్ కు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని ఆ విభాగం ఉన్నతాధికారులకూ సమాచారం ఇచ్చారు.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
ఇదిలా ఉండగా ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్‌ను గతంలో విచారణకు పిలుస్తూ పోలీసులు నోటీసులు పంపారు. ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు పంపారు. హైదరాబాద్‌లో రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చినప్పుడు సునీల్ కూడా వచ్చారని అధికారులు గుర్తించారు. దీంతో ఇందులో ఆయన పాత్రపై విచారించేందుకు నోటీసులు పంపారు. సునీల్‌నాయక్‌ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: Sandeep Reddy Vanga: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..