Pawan VS Stalin: డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్ ఫైర్! సనాతన ధర్మం గురించి ఏడాది క్రితం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరోసారి రెచ్చిపోయారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయనకి చురకలు అంటించారు. దీంతో స్టాలిన్ కూడా కౌంటర్ గా లెట్స్ సీ అని అన్నారు. By Bhavana 05 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Pawan Kalyan: విన్నారుగా.. పవన్ కల్యాణ్ ఏం అన్నారో...! సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మీరే సర్వనాశానమవుతారు..! ఇది ఎవరిని టార్గెట్ చేస్తూ అన్నారో అర్థమయ్యే ఉంటుంది కదా! 2023 సెప్టెంబర్‌లో తమిళనాడు డీఎంకే డిప్యూటి సీఎం ఉదయనిధి స్టాలిన్ హిందూమతం గురించి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చారు ఉదయనిధి స్టాలిన్. దీనిపై అప్పట్లోనే పవన్ కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా తిరుమల వారాహి డిక్లరేషన్ సభలో మరోసారి ఉదయనిధి స్టాలిన్ లక్ష్యంగా పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఏమీ చేయలేవంటూ స్టాలిన్ పేరు ప్రస్థావించకుండా ఆయనపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని... దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక యువ నాయకుడు అన్నారంటూ ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్లు ఇచ్చారు పవన్. అయితే అలా చెప్పిన వారు చాలా మంది ఉన్నారని... మీరు మొదటివారు లేదా చివరివారు కాదన్నారు. ఇంకా చాలా మంది రాబోతున్నారని.. మీలాంటి వాళ్లు వచ్చి వెళ్లిపోయారని చురకలంటించారు. అయితే సనాతన ధర్మానికి ఏమీ జరగదంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఇక పవన్ కామెంట్స్‌కు ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. లెట్స్ సీ అని కౌంటర్ ఇచ్చారు. నిజానికి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం రేగినా ఆయన మాత్రం ఎక్కడా తగ్గలేదు. కుల నిర్మూలన విషయంలోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉదయనిధి అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. తన మాటలు వెనక్కి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇక సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని చెప్పడం కాక రేపింది. అదే సమయంలో మరో డీఎంకే నేత రాజా సనాతన ధర్మాన్ని HIVతో పోల్చి అగ్నికి ఆజ్యం పోశారు. Also Read: యూట్యూబర్ హర్షసాయికి షాక్! వాస్తవానికి తమిళనాట పొలిటిక్స్ పెరియర్ సిద్ధాంతాలపై నడుస్తాయి. ముఖ్యంగా డీఎంకే నేతలు ఆయన భావజాలాన్నే పాటిస్తారు. సనాతన ధర్మంలోని పెనవేసుకున్న అంటారనితనంపై పెరియర్ యుద్ధాలే చేశారు. ఇప్పుడు పవన్ సనాతన ధర్మాన్ని భుజానకెత్తుకోవడం.. అదే సమయంలో డీఎంకే టార్గెట్‌గా విమర్శలు చేస్తుండడం రెండు రాష్ట్రాల మధ్య వైరానికి దారితీసే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తమిళులను ఐక్యానికి చిహ్నంగా చెబుతుంటారు. Also Read: 'వైఎస్సార్ జిల్లా' పేరు మార్చాలి.. చంద్రబాబుకు మంత్రి లేఖ తమిళనాడులో ప్రధానంగా రెండు పార్టీలే ఉన్నా ఆ రెండూ కూడా పెరియర్ సిద్ధాంతాల విషయంలో ఒకే తాటిపై ఉంటాయి. ఉదాహరణకు బీజేపీతో కొన్నాళ్లు పొత్తులో ఉన్న అన్నాడీఎంకే 2023 అక్టోబర్‌లో తెగదెంపులు చేసుకుంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై నాడు పెరియర్‌పై చేసిన నెగిటివ్ కామెంట్స్‌తో అన్నాడీఎంకే పొత్తును బ్రేక్ చేసింది. ఇక చాలా కాలంగా తమిళనాడులో ఎలాగైనా ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి 2024 ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. మతపరమైన కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచిన అన్నామలై కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు పవన్ కేవలం ఏపీలోనే కాదు.. తెలంగాణ, తమిళనాడుతో పాటు దేశరాజకీయాలను ప్రభావితం చేయాలని అడుగులువేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తమిళ పాలిటిక్స్‌పైనా ఇంపాక్ట్ చూపించాలని భావిస్తున్నట్టుగా పవన్ కౌంటర్లు చూస్తుంటే అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు. Also Read: సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక అటు వారాహి డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీపైనా విమర్శలు గుప్పించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో కూలీ వాళ్లు, రైతులు ఎక్కడైనా కనిపించారా అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. మీకు సనాతనీ హిందువుల ఓట్లన్నీ కావాలి కానీ మీరు రాముడిని గౌరవించరా అంటూ పవన్ ప్రశ్నించారు. మీరు మోదీజీని ద్వేషించవచ్చు కానీ శ్రీరాముడి గురించి మాట్లాడితే ఊరుకోబోమని ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈ స్పీచ్‌తో పవన్ జాతీయ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. Also Read: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే ..వానలు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి