/rtv/media/media_files/2024/10/23/r1evEPhL3rMOnNuC1p2I.jpg)
రేపు మధ్యాహ్నం 12 గంటలకు సంచలన విషయాలు బయటపెడతామని టీడీపీ, వైసీపీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన పోస్టులు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు Big Expose.. అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బయటపెడతామని ఆ పోస్టులో పేర్కొంది టీడీపీ. దీనికి కౌంటర్ గా.. Big Reveal అంటూ టీడీపీ పోస్ట్ చేసింది. దీంతో ఎవరు ఏం భయటపెట్టబోతున్నారు? రేపు అసలు ఏం జరగబోతోంది? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
Big Expose! Coming on 24th Oct at 12 PM!!
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
Stay Tuned!! pic.twitter.com/PlvS65Kdz2
Get ready for the truth bomb 💣 Dropping on 24th Oct at 12 PM!
— YSR Congress Party (@YSRCParty) October 23, 2024
Stay tuned ❗#BigExpose pic.twitter.com/IxkzYt2N4x
అయితే.. ఆర్టీవీ వద్ద ఇందుకు సంబంధించిన ఎక్స్‌క్లూజీవ్ సమాచారం ఉంది. ఈ సమాచారం ప్రకారం.. జగన్ తన చెల్లి షర్మిలకు చేసిన అన్యాయాన్ని టీడీపీ బయటపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ ఫీజు రీయింబర్స్మెంట్ లో అవకతవకలను తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టనుంది.
ఏపీలో ఏ మాత్రం తగ్గని పొలిటికల్ హీట్..
ఏపీలో ఎన్నికలు ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఓ అంశంపై అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మధ్యలో తిరుపతి లడ్డూ వివాదం అయితే రాజకీయాలను కుదిపేసింది. దాదాపు నెల రోజుల పాటు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు ఆదేశాలతో ఈ అంశానికి తాత్కాలిక బ్రేక్ పడింది. టీడీపీ ఆఫీసుపై దాడి అంశం, జెత్వానీ కేసు, మద్యం కుంభకోణం తదితర అంశాలపై నిత్యం ఏదో అంశంపై రాజకీయ రగడ సాగుతూనే ఉంది.