Punarvika : పునర్వికకు పునర్జన్మ.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు

SMA (Spinal muscular atrophy) డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాప పునర్వికను కాపాడుకునేందుకు #SavePunarvika పేరుతో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమం విజయవంతమైంది. ఆ విరాళాలకు తోడు ప్రభుత్వం మిగతా భరించేందుకు ముందుకు వచ్చింది.

New Update
FotoJet (17)

#SavePunarvika

Punarvika : SMA (Spinal muscular atrophy) డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాప పునర్వికను కాపాడుకునేందుకు #SavePunarvika పేరుతో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమం విజయవంతమైంది. పునర్వికను కాపాడుకునేందుకు  ట్రావెల్ విత్ జగదీష్, రుద్రరాజు శివ ఇలా అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. పునర్విక పునర్జన్మ పొందాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేస్తేనే బతుకుతుందని తల్లిదండ్రులు స్పష్టం చేయడంతో  ఆ పసిపాపను కాపాడేందుకు సోషల్ మీడియాతో పాటు వేలాదిమంది కదిలివచ్చారు. సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనే పదానికి నిజమైన అర్థం చెప్పేలా పలువురు ఊరూర చేపట్టిన విరాళాల సేకరణకు ఊహించని రీతిలో స్పందన లభించింది. రుద్రరాజుశివ ఏకంగా తనచేతికి ఉన్న రూ.5 లక్షల విలువైన బంగారపు బ్రేస్ లెట్ ను ఆ పాప కోసం విరాళంగా ఇవ్వడంతో పలువురు అతన్ని అభినందించడడంతో పాటు తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. కాగా పలువురు ఈ విషయమై  ప్రభుత్వం కూడా స్పందించాలని మంత్రుల్ని ట్యాగ్స్ చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెట్టడంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించారు.

కాగా పునర్విక ట్రీట్‌మెంట్‌ విషయంలో ఆమె తండ్రి సురేష్‌ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆయన మాట్లాడుతూ పలువురు దాతలు ఇచ్చిన విరాళాలు, కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 లక్షలతో కలిపి తమకు రూ.10 కోట్లు వచ్చాయని, ఇంజక్షన్‌కు మరో రూ.6 కోట్లు అవసరం ఉంటుందని, అంత భరించే స్తోమత తమకు లేదంటూ సురేష్ వీడియోలో పేర్కొన్నారు. తనపాపను బతికించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా,  సురేష్ చేసిన వీడియో వైరల్‌ కావడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. SMA టైప్-1 అనేది చాలా రేర్ జెనెటిక్ కండిషన్ డిసీజ్ అని, ఇది పిల్లల మజిల్స్ ను క్షీణింపజేసి, ప్రాణం తీస్తుందని ఆయన ట్వీట్ చేశారు. పునర్విక జీవితాన్ని మార్చేసే రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం వేలాదిమంది ప్రజలు స్పందించి రూ.10 కోట్లు విరాళాలు ఇవ్వడం తనను కదిలించిందని లోకేష్‌ పేర్కొన్నారు. విరాళాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని, ఇప్పుడు తనవంతు సహాయం అందించాల్సిన సమయం వచ్చిందన్నారు.

పునర్వికకు ప్రాణాపాయం నుంచి విముక్తి కలిగించే చికిత్స కోసం కావాల్సిన మిగిలిన రూ.6 కోట్లను అందించే బాధ్యతను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అంటూ లోకేష్‌ భరోసా ఇచ్చారు. అంతేకాక ఈ విషయంలో సమన్వయం చేయవలసిన బాధ్యతలను తన ఆఫీస్ టీమ్ కు అప్పగించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయిన ఈ ధైర్యవంతురాలి చికిత్స కోసం అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని లోకేష్‌ కోరారు. ఆ చిన్నారి పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలూ తీసుకోవలసిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా లోకేష్ స్పందించి పునర్విక ఆరోగ్యానికి భరోసా ఇవ్వడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు