/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
Posani Krishna Murali
Posani Krishna Murali : ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరుల పై అనుచిత వ్యాఖ్యాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యారు వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి.ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్‌పై కర్నూలు జిల్లా ఆదోని కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పోసానిని కస్టడీకి కోరుతూ పోలీసులు తరపున దాఖలైన పిటిషన్‌తో పాటు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
న్యాయమూర్తి ముందు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలు ముగిశాయి. వైసీపీ శ్రేణులు తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు.కస్టడీ మంజూరు చేస్తే, న్యాయవాది సమక్షంలో ఎస్పీ లేదా డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరపాలని న్యాయవాదులు అభ్యర్థించే అవకాశం ఉంది.అయితే పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇది కూడా చూడండి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
సందర్భంగా పోసాని లాయర్ మాట్లాడుతూ ‘‘పోసాని బెయిల్ అప్లికేషన్‌పై మా లీగల్ టీమ్ వాదనలు వినిపించింది. ప్రాసిక్యూషన్ వారు కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడి పిటిషన్‌పైనా వాదనలు వినిపించాం. పోసానిని కస్టడీకి ఇవ్వాల్సి వస్తే లాయర్ సమక్షంలో ఒక రోజు విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాం. అలాగే పోసాని అనారోగ్యం దృష్ట్యా ఎస్పీ, డీఎస్పీ సమక్షంలో విచారణ జరగాలని అభ్యర్థించాం.
మా అభ్యర్థనను పరిగణననలోకి తీసుకుని రేపో, ఎల్లుండో తీర్పు వచ్చే అవకాశం ఉంది. బెయిల్‌పై కూడా వాదనలు వినిపించాం. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరోసారి వాదనలు వినిపిస్తాం. రేపు గాని, ఎల్లుండి గాని బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చే అవకాశం ఉంది. పోసానికి బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అని పోసాని తరపున లాయర్ పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి బెయిల్ పై కోర్టు రేపు కీలక తీర్పు ఇవ్వనున్నట్లు సమాచారం..