MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్‌షాక్ తగలింది. ఆయనకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, జనసేన ఆఫీస్ పై దాడి చేశారని జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో టెక్కలిలోని దువ్వాడ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడారు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని తాను కాదని దువ్వాడ శ్రీను స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్‌షాక్
AP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్‌షాక్ తగలింది. ఆయనకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.