AP: వైసీపీ నేతలకు నోటీసులు AP: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వైసీపీ ముఖ్యనేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా నోటీసులు ఇచ్చారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. By V.J Reddy 27 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YSRCP Leaders: మాజీ సీఎం జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఏమ్మెల్సీలకు, కీలక నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతలకు నోటీసులను ఎస్ఐలు అందజేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు నోటీసులు ఇచ్చారు. నేతల తరఫున ఎవరు వచ్చినా కఠిన చర్యలు తప్పవని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కాగా మరికొంత మంది ముఖ్య నేతలను ఇప్పటికే పోలీసులు ఆరెస్టు చేశారు. నడవడిక వల్ల ఎలాంటి నేర ఘటన చోటుచేసుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. శాంతి భద్రల దృష్ట్యా ఎలాంటి అవాంచనీయ ఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నోటీసులకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. YSRCP says, "Andhra Pradesh Police, acting on the directions of CM N Chandrababu Naidu and minister Nara Lokesh, have begun issuing notices to YSRCP leaders ahead of Y.S. Jagan Mohan Reddy’s Tirupati tour, warning them not to participate in the event. Many leaders in the region… — ANI (@ANI) September 27, 2024 రేపు అన్ని ప్రాంతాల్లో.. తిరుపతి లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఆసత్య ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. #ap-news #ycp-leaders మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి