/rtv/media/media_files/2025/04/13/woLGxkvwOXrDnyJfRe4w.jpg)
anna lezhneva
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.