పాస్టర్ ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి వెలుగులోకి మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వచ్చింది. మార్చి 24న ఆయన రాజమండ్రికి బయల్దేరిన తర్వాత ఎల్బీనగర్ సవేరా వైన్స్‌కు ప్రవీణ్ వెళ్లారు. మధ్యాహ్నం 12.24 గంటల సమయంలో ఆయన వైన్స్‌లోకి వెళ్లారు. అయితే.. ప్రవీణ్ వైన్స్ లోకి వెళ్తుండగా ఓ వ్యక్తి వెనుక నుంచి ఆయనను ఫోటో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ప్రవీణ్ ను ఎందుకు ఫొటో తీశాడు? ఆ ఫొటోను ఎవరికైనా పంపించాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో వెంబడించి హత్య చేశారని.. ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యమని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వీడియోపై పోలీసులు ఎలాంటి సమాధానం ఇస్తారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ కు ఫస్ట్ ఎయిడ్ చేసింది మేమే.. మాకు ఏం చెప్పారంటే.. టోల్ గేట్ సిబ్బంది సంచలన వీడియో!
హత్య ఆరోపణలకు బలం..
ప్రవీణ్ ను కొందరు హత్య చేశారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వారు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎర్ర కారు ప్రవీణ్ ను వెంబడించిందని.. ఆ కారు ఎక్కడి నుంచి వెంబడించిందో పోలీసులు బయటపెట్టాలని సోషల్ మీడియా లో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రవీణ్ ను ఓ వ్యక్తి వెనుక నుంచి ఫొటో తీస్తున్న వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రవీణ్ ను హత్య చేశారు అన్న ఆరోపణలు చేస్తున్న వారికి బలం చేకూరింది. ప్రవీణ్ ను వీడియో తీసిన వ్యక్తిని గుర్తించి విచారిస్తే అసలు నిజాలు బయటపడుతాయన్న వాదనలు వనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pastor Praveen wines : వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్...రూ.950 ఫోన్ పే చేసి.. షాకింగ్ వీడియో
(telugu-news | telugu breaking news | latest teluu news)