Lady Aghori : అఘోరీ కాదు.. శ్రీనుగాడే..యువతితో లవ్ ట్రాక్... అనిల్ బెహరా సంచలన వ్యాఖ్యలు

రెండు తెలుగు రాష్ట్రాలలో లేడీ అఘోరీ అందరికీ తెలుసు. కారణం సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తోన్న హల్ చల్ అంతా ఇంతా కాదు. తాజాగా ఒక యువతితో మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి అఘోరిని తన కళ్ల ముందు కనిపించాలని ప్రాధేయ పడడం విశేషం.

New Update
lady aghori vs anil behara

lady aghori vs anil behara

 Lady Aghori : రెండు తెలుగు రాష్ట్రాలలో లేడీ అఘోరీ అందరికీ తెలుసు. కారణం సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తోన్న హల్ చల్ అంతా ఇంతా కాదు. తాజాగా ఒక యువతితో మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ యువతి అఘోరిని ఇప్పటికిప్పుడు రావాలని, తన కళ్ల ముందు కనిపించాలని ప్రాధేయ పడడం విశేషం. ఈ ఆడియోకు సంబంధించి గుంటూరుకు చెందిన హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహరా స్పందించారు. ఆర్టీవీతో మాట్లాడిన అనిల్ బెహరా లేడీ అఘోరీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.  


Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి తీసుకున్న రమ్మీ

వాడిని ముందు లేడీ అఘోరీ అని ఎవరూ పిలవద్దని బెహరా కోరారు. కేవలం శీను మాత్రమేనని, తనకు సంబంధించి అన్ని రుజువులు తన వద్ద ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు. కేవలం అవయవాలు మార్పిడి మాత్రమే జరిగిందని, ట్రాన్స్ జెండర్ కాదన్నారు. లేడీ అఘోరీ శ్రీనివాస్ బ్రెస్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడన్నారు.వైరల్ అవుతున్న ఆడియోలో, మాట్లాడుతున్న యువతి సోదరుడు అని చెప్పుకుంటున్న వ్యక్తికి నేర చరిత్ర ఉందన్నారు.

Also read: Ap news: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు

కేవలం మీడియా స్టంట్ కోసం అఘోరీ రోజుకొక విషయాన్ని లేవనెత్తుతున్నట్లు ఆరోపించారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం శీనుకు అలవాటుగా మారిందని, యూట్యూబ్ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడన్నారు. ఫారిన్ నుండి నిధులు అఘోరీకి వస్తున్నాయని, లేకుంటే ఇంత లగ్జరీ బ్రతుకు ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి వారిని ఎవరూ ప్రోత్సహించ వద్దని, పోలీసులను దుర్భాషలాడుతున్న పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సనాతన ధర్మానికి పట్టిన చీడపురుగు శీను అలియాస్ లేడీ అఘోరీ అని, ఇప్పటికైనా అతనిని కట్టడి చేయాలని కోరారు. 1997 నుండి హిందూ ధర్మం కోసం పోరాడు తున్నామని, తమకు అప్పులు, కేసులు మిగిలాయని, కానీ అఘోరీకి ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.

Also read: live longer: అందరికన్నా వీళ్లు మూడేళ్లు ఎక్కువ జీవిస్తారు.. ఎందుకంటే?

లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఒక యువతితో సన్నిహితంగా ఉండడం చూసి రాజేష్ నాథ్ అనే వ్యక్తి మందలించారన్నారు. అప్పటినుంచి లేడీ అఘోరీ రాజేష్ నాథ్ పై కుట్రలు మొదలుపెట్టాడన్నారు. రాజేష్ నాథ్ తణుకులో నిర్వహించే శ్లాటర్ హౌస్ మూసేపించారని ఆరోపించారు.అసలు విషయం తెలిసిన తర్వాత మేము రాజేష్ నాథ్ కు అండగా నిలబడ్డాం.  అసలు విషయం తెలిసిన తర్వాత మేము రాజేష్ నాథ్ కు అండగా నిలబడ్డాం.అందుకే నన్ను లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ రెచ్చగొట్టాడని తెలిపారు. లేడీ అఘోరీకి కారు మెయింటైన్ చెయ్యడానికి డబ్బులు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గోవులను అమ్మడం ద్వారా వ్యాపారం చెయ్యాలని అఘోరి చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేడీ అఘోరీ మంగళగిరి, కంతేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి రాజేష్ నాథ్  పీఠంపై కన్నేశారని ఆరోపించారు.

Also Read: weather forecast: ఈ 143 మండలాల వారు జాగ్రత్త.. దేశంలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు మన దగ్గరే..
  
  ఇటీవల తణుకు వెళ్లిన అఘోరీ. అక్కడ అఘోరీ రాజేష్ నాథ్ ఆశ్రమం వద్ద అఘోరీ బైఠాయించి ఓ యువతికి మద్దతు పలికారు. ఆ యువతి ఏకంగా సోషల్ మీడియాలో రాజేష్ నాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఆ సమయంలో తణుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అఘోరీ, తన వద్ద పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి నిప్పంటించుకొనే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆమెను వారించారు. ఆ ఎపిసోడ్ అలా ముగియగానే, అఘోరీ తన మకాం గుంటూరుకు మార్చింది. గుంటూరుకు చెందిన అనిల్ బెహరా ఎన్నో ఏళ్లుగా హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏ వివాదం ఉందో తెలియదు కానీ, అఘోరీ గుంటూరుకు వచ్చి బెహరా ఇంటి ముందు బైఠాయించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని నల్లపాడు పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి అఘోరీకి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా ఈ రోజు అనిల్ బెహరా అఘోరీ అసలు అఘోరినే కాదని, శ్రీనుగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది.

Also Read: మేఘా అవినీతిపై ముంబై హైకోర్టులో విచారణ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు