Hyderabad: మిచౌంగ్ ఎఫెక్ట్..హైదరాబాద్ లో మొదలైన వాన!
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు అయ్యాయి.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ముఖ్యగమనిక. నేడు ఏపీ వ్యాప్తంగా పాఠశాలలకు సర్కార్ సెలవు ప్రకటించింది. ఏపీలో మిచైంగ్ తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
మైచౌంగ్ తుఫాన్ భయంకరంగా మారింది. అమెరికాలో వచ్చే తుఫాన్లతో పోల్చినట్లయితే ఇది చిన్నదే. అయినప్పటికీ దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారీ తుపానుగా మారింది. దీంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.