YCP: ఓటు వేయకపోతే ఇలా చేయండని చెప్పడం విడ్డూరం: ఎమ్మెల్యే
తమకు ఓటు వేయకపోతే భర్తలకు అన్నం పెట్టవద్దంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. వైసీపీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవ చేశారు.
తమకు ఓటు వేయకపోతే భర్తలకు అన్నం పెట్టవద్దంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. వైసీపీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవ చేశారు.
టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో విజయవాడ, విశాఖపట్నంకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు, జనసేన నాయకులు అధికార పార్టీ గూటికి చేరుకున్నారు.
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు సన్నిహితులే ఉన్నారని విచారణలో తేలిందన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఓటమి భయంతోనే వైసీపీపై టీడీపీ వికృత చేష్టలు, అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శలు గుప్పించారు.
అధికార పార్టీకి చెందిన వారు ఉచ్చ నీచాలు మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విజయసాయి రెడ్డికి గెలుస్తాననే నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.
మా నాన్న నారాయణ స్వామి కోరిక మేరకే నాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీటు కేటాయించారని తెలిపారు జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి. ప్రతీనాయకుడిని కలుపుకుని ముందుకు వెళ్తూ అసంతృప్తి పరులను సైతం సంతృప్తి పరిచి విజయం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.
నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి సుజితమ్మ, కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటికీ తిరుగుతూ శ్రీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
టీడీపీ గెలుస్తుందనే నమ్మకం బీజేపీకి ఏ మాత్రం లేదన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. రాష్ట్రంలోని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని పేర్కొన్నారు. సొంతంగా 370 సీట్లు.. ఎన్డీయే కూటమికి 400 సీట్లను బీజేపీ టార్గెట్ పెట్టుకుందన్నారు. అందులో టీడీపీ,జనసేన వాటా సున్నా అంటూ ఎద్దేవా చేశారు.