Nara Lokesh: దేవాన్ష్ బర్త్ డే స్పెషల్.. స్వర్ణ దేవాలయంలో లోకేష్ ఫ్యామిలీ.

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయమైన స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. సంప్రదాయ వస్త్రాలతో తల పాగా ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.

New Update
Nara Lokesh Temple Visit

Nara Lokesh Temple Visit

Nara Lokesh: సిక్కుల పవిత్ర ఆలయమైన స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆధ్యాత్మిక ప్రశాంతతకు మారు పేరైన ఈ స్వర్ణ దేవాలయం  పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో కొలువై ఉంది. నారా లోకేశ్‌ తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌తో కలిసి ఆదివారం ఉదయం ఈ దేవాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ వస్త్రాలతో తల పాగా ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. స్వర్ణమందిర్‌ చరిత్ర, విశేషాలు, ప్రత్యేకతలను శ్రీహర్మందిర్‌ సాహిబ్‌  నిర్వాహకులు నారా లోకేష్ దంపతులకు వివరించారు.

Also Read: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చింది..

స్వర్ణ దేవాలయం సందర్శనంతరం స్థానిక లంగర్‌హౌస్‌ను పరిశీలించారు లోకేష్, రోజూ వేల మంది భక్తులకు ఆహారం అందించే స్వర్ణ దేవాలయం వడ్డనా పదార్థాలను, ఆహరం ఎంత మందికి అందిస్తున్నారు అన్న విషయాలపై లోకేష్ ఆరా తీశారు. దేవాలయంలో ఎంత మంది పని చేస్తున్నారు, నిర్వహణా విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘‘అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించాను. పవిత్ర హర్మందిర్‌ సాహిబ్‌ను సందర్శించే అవకశం దొరకడం నా అదృష్టం, నాకు ఎంతో సంతోషంగా ఉంది. సిక్కు గురువుల ఆశీస్సులు పొందాను. ఆ ఆవరణలో గడిపిన సమయం నా మనస్సు‌కు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చింది’’ అన్నారు.

Also Read: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

Also Read: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.  రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని..  వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు.

New Update

మాజీమంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.  రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని..  వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఈ కామెంట్స్ చేశారు.  టీడీపీ నేతలు తమపై కక్ష పెట్టుకోవద్దంటున్నారు.. అది మాత్రం జరగదు..  ఎవర్నీ వదలమని తెలిపారు.  గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడుతామని...  గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతామన్నారు.  మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరమేనని తెలిపారు.  గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి మరి నరికిపారేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో  కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment