/rtv/media/media_files/J4Us1WYPunvKulPXn9y0.jpg)
Lokesh:
మాజీ సీఎం జగన్ పై మరోసారి ట్విట్టర్ (X) వేదికగా నిప్పులు చెరిగారు మంత్రి లోకేష్. అధ్యక్షుడు జగన్ నుంచి వైసీపీ కార్యకర్త వరకు అందరూ ఫేక్ ప్రచారమే ఆయుధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించారని, ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేస్తున్నారని తప్పుడు ప్రచారంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా భాగమయ్యారని అన్నారు.
వైసిపి అధ్యక్షుడు జగన్ నుంచి వైసీపీ కార్యకర్త వరకు అందరూ ఫేక్ ప్రచారమే ఆయుధంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించారని, ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేస్తున్నారని తప్పుడు ప్రచారంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా భాగమయ్యారు. ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తేడా తెలియని ఎంపీ గారు మీ… pic.twitter.com/JoopbBFOks
— Lokesh Nara (@naralokesh) October 11, 2024
ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తేడా తెలియని ఎంపీ గారు మీ హయాంలోనే పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను తాము చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని పేదలకు వరంగా అందిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు మానండి ఎంపీ అంటూ చురకలు అంటించారు. మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే పనిలో మా ప్రభుత్వ సహకారం తీసుకోండి.. అప్పుడు ఎన్నుకున్న మీ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు అని హితవు పలికారు.