/rtv/media/media_files/2026/06/11/little-girl-goes-missing-in-tuni-2026-06-11-18-06-21.jpg)
Little girl missing in Tuni, Kakinada district
Gyaneshwari EXPLAINER : కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి కథ వణుకు పుట్టిస్తోంది.చిన్నారి మిస్సై 6 రోజులైన ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది..?అసలు ఆమె ప్రాణాలతోనే ఉందా..?ఈ భయంతోనే ఆ తల్లిదండ్రులు క్షణక్షణం వణికిపోతున్నారు.
తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహరంలో..సుంకర భవాని -గణేష్ దంపతులు ఉంటున్నారు. వీళ్ల గారాలపట్టే జ్ఞానేశ్వరి. ఈ చిన్నారికి రెండున్నరేళ్లు ఉంటాయి.అయితే ఈనెల 6న నాన్నా.. నాన్నా అంటూ..ఇంట్లోంచి వెళ్లిన పాప.. మళ్లీ తిరిగి రాలేదు. మొదట ఇంటి చుట్టూ వెతికారు.తర్వాత తోటల్లో వెతికారు.ఆ తర్వాత కొండల వైపు వెళ్లారు. కానీ... ఎక్కడా లేదు.రెండున్నరేళ్ల పాప..అంత తక్కువ సమయంలో ఎలా మాయమైపోయింది? ఇక్కడి నుంచే మొదలైంది జ్ఞానేశ్వరి మిస్టరీ.
పాప మిస్ అయిన నిమిషం నుంచి ఆ ఊర్లో నరకం కనిపిస్తోంది. కన్నవాళ్లకు కంటిమీద కునుకు లేదు. చిన్నారి జానూ ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. వెంటనే రంగంలోకి దిగింది పెద్దాపురం డివిజన్ పోలీస్ ఫోర్స్.
200 మందికి పైగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడవులను జల్లెడ పడుతున్నారు.అడ్వాన్స్‌డ్ డ్రోన్ కెమెరాలను గాల్లోకి లేపారు. కొండ కోనలను స్కాన్ చేస్తున్నారు.డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. కానీ.. రిజల్ట్? ZERO..
6 రోజులు గడుస్తున్నా ఒక్క క్లూ కూడా దొరకలేదు.
పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందంటే.. పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల క్యాష్ రివార్డ్ ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వాళ్ల డీటెయిల్స్ కంప్లీట్ సీక్రెట్‌గా ఉంచుతామన్నారు.అసలు ఆ చిన్నారి ఇంకా ఆ కొండల్లోనే ఉందా? ఎవరైనా కిడ్నాపర్లు చాక్లెట్, బిస్కెట్ ఆశ చూపి తీసుకెళ్లిపోయారా? లేదా చుట్టుపక్కల ఉన్న ఓపెన్ బోరుబావుల్లో ఏమైనా పడిపోయిందా?ఈ సస్పెన్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది..
ట్విస్ట్ ఏంటంటే.. పాప మిస్ అయిన రోజు నుంచే.. వాళ్ల ఇంట్లో ఉండే పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అందరూ పాపతో పాటే కుక్కను కూడా ఎవరో తీసుకెళ్లారేమో అనుకున్నారు. కానీ, పాప మిస్ అయిన నాలుగు రోజుల తర్వాత.. ఆ పెంపుడు కుక్క హఠాత్తుగా ఇంటి ముందుకు వచ్చింది. కానీ, అది నార్మల్‌గా లేదు! అంతకుముందు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కొండల్లో పాప ఏడుపు విన్నానని, కానీ ఈ కుక్కను చూసి భయపడి వెనక్కి వచ్చేశానని చెప్పాడు. అంటే.. ఆ కుక్క పాపను కాపాడుతుందా? లేక ఎవరినైనా రానివ్వకుండా అడ్డుకుంటోందా?ఇంటికి వచ్చిన కుక్క.. తనను పట్టుకోబోయిన వాళ్లపై దాడి చేయడానికి ట్రై చేసింది. అంతలోనే మళ్లీ కొండల్లోకి పారిపోయింది.
మళ్లీ రెండోసారి ఆ కుక్క ఇంటి దగ్గరకు వచ్చింది. ఈసారి అది చేసిన పని చూస్తే అందరి మైండ్స్ బ్లాంక్ అయ్యాయి.పాప తల్లి భవాని చున్నీని నోటితో పట్టుకుని గట్టిగా లాగింది.చున్నీ లాగి.. మళ్లీ కొండల వైపు చూస్తూ పరుగెత్తింది. ఇక్కడే కేసు మిస్టరీ మరింత పెరిగింది. అది యాదృచ్ఛికమా? లేక...ఎక్కడికో తీసుకెళ్లాలని ప్రయత్నించిందా? అనే ప్రశ్నలు వినిపించాయి.
పోలీసులు వెంటనే స్పందించారు. డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆ ప్రాంతాన్ని మళ్లీ వెతికారు. రాత్రి వరకు సెర్చ్ కొనసాగింది.అయినా స్పష్టమైన ఆధారం దొరకలేదు.ఇప్పుడు అధికారుల ముందున్న పెద్ద ప్రశ్న...చిన్నారి కనిపించకుండా పోయిన రోజు నుంచి...ఈ కుక్క ఎక్కడ తిరిగింది? ఒకవేళ ఎవరైనా అపహరించి ఉంటే...కుక్క వెంటనే తిరిగి వచ్చి ఉండొచ్చు. కానీ నాలుగు రోజుల తర్వాత మాత్రమే ఎందుకు వచ్చింది?ఒకవేళ పాప కొండ ప్రాంతంలో ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే...కుక్క ఆమె దగ్గరే ఉందా?లేదా... ఇంకా తెలియని కారణం ఉందా?ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పటికీ లేదు.అందుకే అధికారులు కుక్కను సురక్షితంగా పట్టుకుని దాని ప్రవర్తనను పరిశీలిస్తున్నారు.
ఇప్పుడు మొత్తం జిల్లా ఎదురు చూస్తున్న ఒకే ఒక్క విషయం...చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది?ఈ కేసులో ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద క్లూ...ఆ పెంపుడు కుక్కే.కానీ.. అది చెప్పాలనుకుంటుంది ఎవరికీ అర్థం కావడం లేదు.
అడవిలో ఏమైంది? కొండల్లో ఏం దాగి ఉంది?అసలు చిన్నారి సురక్షితంగానే ఉందా?ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు...ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోతుంది.ఆ చిన్నారి సేఫ్‌గా తిరిగి రావాలని మనమందరం కోరుకుందాం.
Follow Us