/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆ జట్టును ఓడించి రెండోసారి WPL టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో ఫైనల్‌లో కూడా ఓడిపోయింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆ జట్టును ఓడించి రెండోసారి WPL టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో ఫైనల్‌లో కూడా ఓడిపోయింది. మార్చి 15న (ఆదివారం) బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది.
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
మారిజాన్ కాప్ తుఫాను ఇన్నింగ్స్
ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది, కానీ ఆ జట్టు 9 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. 83 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి అల్మోస్ట్ జట్టు ఓటమిని అంగీకరించే సమయంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మారిజాన్ కాప్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. అయితే18వ ఓవర్లో హేలీ మాథ్యూస్ వేసిన బంతికి కాప్ అవుట్ కావడంతో ఢిల్లీ ఆశలు దెబ్బతిన్నాయి. కాప్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేయగా.. జెమిమా రోడ్రిగ్స్ 30 పరుగులు, నిక్కీ ప్రసాద్ 25 నాటౌట్ పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ తరఫున నాట్ స్కైవర్-బ్రంట్ మూడు వికెట్లు తీసింది.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
అంతకుముందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించింది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ రెండోసారి WPL టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు 2023లో జరిగిన WPL మొదటి సీజన్‌ను కూడా ముంబై జట్టు గెలుచుకుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడోసారి ఫైనల్‌లో ఓడిపోయింది. WPL రెండవ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి గెలిచింది.
-
Mar 16, 2025 13:44 IST
నకిలీ ఎస్ఐలు.. చీప్గా రూ. 10 వేలు అడిగి దొరికిపోయారు!
-
Mar 16, 2025 13:32 IST
Saidabad: అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి.. నిందితులు ఆలయ అర్చకులే!
-
Mar 16, 2025 11:01 IST
Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది
-
Mar 16, 2025 09:58 IST
BIG BREAKING: ఏఆర్ రెహమాన్ కు హార్ట్ ఎటాక్
-
Mar 16, 2025 09:19 IST
USA: హెచ్ 1 బీ వీసాల రూల్స్ మళ్ళీ మార్పులు.. మరింత కఠినం !
-
Mar 16, 2025 09:18 IST
Karnataka: రోజుకో రకంగా వాంగ్మూలం..తికమక పెడుతున్న రన్యారావు
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన రన్యారావు రోజుకో రకంగా వాంగ్మూలం ఇస్తూ డీఆర్ఐ పోలీసులను తికమక పెడుతోంది. తనపై తప్పుడు కేసు పెట్టారని..తనను 24 సార్లు చెంపదెబ్బలు కొట్టారని..బలవంతంగా కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఇలా రకరకాలుగా చెబుతోంది.
ranya rao father IPs Photograph: (ranya rao father IPs) -
Mar 16, 2025 07:10 IST
CRIME: మద్యం మత్తులో యాసిడ్ తాగాడు.. వ్యక్తి మృతి!
-
Mar 16, 2025 07:08 IST
Health Tips: ఉదయాన్నే ఈ కాఫీ తాగితే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు