మరో వైసీపీ కీలక నేతపై లైంగిక ఆరోపణలు.. వాడుకుని వదిలేశాడంటూ

వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గరే రూ.90 లక్షలు కాజేసి ఇప్పుడు మొహం చాటేశాడంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.

New Update

Merugu Nagarjuna: ఏపీ వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ విజయవాడకు చెందిన ఓ మహిళా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు తనకు డిపార్ట్ మెంట్ ఉద్యోగం లేకపోతే కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానని నాగార్జున తనను మోసం చేశాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్‌ పై హార్దిక్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నన్ను నమ్ము అంటూ..

‘నీకు అండగా ఉంటా. నన్ను నమ్ము అంటూ నమ్మించి నాగార్జున లైంగికంగా వాడుకున్నాడు’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తన వద్ద రూ.90 లక్షలు క్యాష్ పీఏ ద్వారా తీసుకున్నాడని, పీఏకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని ఆమె ఆరోపించింది. ఇక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు.

New Update
Matsyakara sevalo scheme

Matsyakara sevalo scheme

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం గ్రామంలో ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా ఈ ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఒక్కో కుటుంబానికి రూ.20,000

ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రారంభించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు రూ.20,000 చెక్కును అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేం. కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోతారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం.. వేటలేని కాలంలో మత్స్యకారులకు జీవనోపాధిని కొనసాగించడానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా గత ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10,000 సహాయాన్ని అందించింది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి రూ. 20,000 సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు కేటాయించింది.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

cm-chandra-babu | ap cm chandra babu naidu | Matsyakara sevalo | srikakulam

Advertisment
Advertisment
Advertisment