Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్ మేళా
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, చేనేత సామాజిక వర్గం నేత మచాని సోమనాథ్ మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ బరిలోకి దింపడంతో టీడీపీ వ్యూహం మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆకి పోగు ప్రభాకర్ ఆత్మహత్యయత్నం చేశాడు. బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. తన భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ కార్యాలయం ఎదుట శివ స్వాములు నిరసన చేపట్టారు. శ్రీశైలం వెళ్లే శివ భక్తుల నుండి ఫారెస్ట్ అధికారులు పది రూపాయలు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతి ఇస్తారని.. పూర్తిస్థాయిలో పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకు? అని ప్రశ్నించారు మంత్రి బొత్స. మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని చెప్పారు.
శ్రీశైలవాసులకు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ. 19కోట్ల అంచనా వ్యయంతో 30 పడకలు ఆసుపత్రిని నిర్మించాలని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. దేవస్థానం గోసంరక్షణశాలలో రూ. 36లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు.
కర్నూలు వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ముగ్గురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీపీలు వైసీపీని వీడెందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. మంత్రి టీడీపీలో చేరగానే వైసీపీ నుండి టీడీపీలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కర్నూలు జిల్లాలో నాలుగో అదనపు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లైన 14 రోజులకే అనుమానంతో భార్య, ఆమె తల్లిని చంపిన కేసులో తండ్రి కొడుకు లకు ఉరిశిక్ష విధించింది. మరొకరికి జీవిత ఖైదు వేసింది.