Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం

AP: పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు మల్లికార్జునరావు మద్యం మత్తులో ఆకతాయిగా బెదిరింపు కాల్ చేసినట్లుగా గుర్తించారు. కాగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఫిర్యాదు మేరకు 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

New Update
pawan kalyan (2)

Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు మల్లికార్జునరావుపై మంగళగిరి పోలీసులు FIR నమోదు చేశారు. నిన్న నిందితుడిని గంట పాటు పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. కాగా విచారణలో పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు నిందితుడు.  మద్యం మత్తులో ఆకతాయిగా బెదిరింపు కాల్ చేసినట్లుగా విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. కాగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఫిర్యాదు మేరకు 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

పవన్ ను లేపేస్తాం...

ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ వచ్చింది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే పవన్‌ను ఉద్దేశించి ఆగంతకుడు అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టాడు. దీంతో ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పవన్ కళ్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించారు.

Also Read: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

హోంశాఖ మంత్రి అనిత రియాక్ట్..

అదే సమయంలో పవన్ పేషీకి బెదిరింపు కాల్స్‌ రావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని డీజీపీ ద్వారక తిరుమల రావు మంత్రి అనితకు వివరించారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అనంతరం మంత్రి అనిత.. పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌ రావడంపై ఆరా తీశారు.

Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

Also Read: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.

New Update

అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

ప్రభాస్ అంటే ఇష్టం

వర్షిణీ మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. అక్కడ నుంచి RTVతో లైవ్ లో మాట్లాడిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తమ ఇష్యూలోకి ప్రభాస్‌ను లాగారు. ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనిపించలేదా? అనే ప్రశ్నకు వర్షిణీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి అబ్బాయి ఉండడని అనుకున్నాను. కేవలం హీరోస్‌లోనే ఇష్టం.. రియల్ లైఫ్‌లో కాదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ను ఫస్ట్ టైం షూటింగ్ లో కానీ ఎక్కడైనా కలిస్తే ఆయన దగ్గరకి వెళ్లి.. హాయ్ సర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్‌ ఆఫ్ యు డార్లింగ్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక సెల్ఫీ కూడా అడుగుతాను. అఘోరీని కూడా డార్లింగ్ అని పిలిస్తాను’’ అని అఘోరీని డార్లింగ్ అని పిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అయితే వర్షిణీ ప్రభాస్ గురించి మాట్లాడుతుండగా.. సరిగ్గా అప్పుడే అఘోరీ వచ్చి ఏంటీ ప్రభాస్ గోల అని లైవ్‌లో అనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఒక్కసారిగా వారు షాక్ అయిపోయారు. తమ అభిమాన హీరో గురించి అఘోరీ అలా అనడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

(aghori | sri varshini | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment