జగన్ బెయిల్ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్! షర్మిల-జగన్ ఆస్తుల వ్యవహారంలో అధినేతకు ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశముందని వైసీపీ ప్రచారం ఊదరగొడుతోంది. జగన్ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తికి షర్మిలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. By Bhavana 26 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Jagan Vs Sharmila: వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టేసిందా? ఆస్తుల వ్యవహారాన్ని తప్పించుకునేందుకు కొత్త పల్లవి ఎత్తుకుందా? ఆస్తుల వ్యవహారానికి – ఆయన బెయిల్ రద్దుకు ఎందుకు లింకుపెడుతోంది? జగన్కు బెయిల్ రద్దు అయ్యే అవకాశముందంటూ ఎందుకు ప్రచారం చేస్తోంది? జగన్కు అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. Also Raed: భారత్ దెబ్బ..మాల్దీవులు అబ్బా..డబ్బుల్లేక అధ్యక్షుడీ జీతంలో కోత తల్లి మీదా, చెల్లిమీదా కేసులు పెడుతాడా. ఆస్తుల విషయంలో వారిని మోసం చేస్తాడా అంటూ జగన్ వ్యతిరేక వర్గాలు రెచ్చిపోయి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. చివరకు తండ్రి చెప్పింది కూడా పాటించకుండా ద్రోహం చేస్తాడా..? ఇచ్చిన షేర్లను కూడా వాపస్ తీసుకుంటాడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. షర్మిల వర్సెస్ జగన్ ఆస్తి వివాదాలు, పంచాయితీల గురించే కాదు, ఆమె రాజకీయాల పోకడల గురించి కూడా వైసీపీ నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు నాయకులంతా జగన్ బెయిల్ రద్దు కోసమే షర్మిలతో ఆరోపణలు చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు జగన్ బెయిల్ రద్దు కావడానికే వివాదాలను రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. షర్మిల కుట్ర చేస్తోందంటున్న వైసీపీ షర్మిల-జగన్ ఆస్తుల వ్యవహారంలో అధినేతకు ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశముందని వైసీపీ ప్రచారం ఊదరగొడుతోంది. జగన్ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తికి షర్మిలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. కుటుంబం ఆస్తులను వైఎస్ఆర్ జీవించిన్నపుడే పంపకాలు చేసేశారని అంటోంది. Also Read: స్పోర్ట్ వర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. చెల్లి షర్మిలపై ప్రేమతో సంపాదించిన ఆస్తిలో కొంత ఇస్తున్నారంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టేసింది. తన సొంత ఆస్తి అయినప్పుడు జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారంటూ ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. అధికార ప్రభుత్వం అండతో విజయమ్మను ముందుపెట్టి జగన్ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తున్నారన్నది అందులోని ప్రధాన పాయింట్. Also Read: ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ...30 మంది విద్యార్థులు..! జగన్ ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఒక ఒప్పందం మాత్రమే షర్మిల, విజయలక్ష్మి, జగన్, భారతి నడుమ సరస్వతి షేర్ల బదిలీకి కుదిరింది. కానీ షేర్లు అటాచ్మెంట్లో ఉండగా, బెయిల్ కండీషన్ల మేరకు బదిలీ కుదరదు, కానీ బోర్డు తీర్మానం కుదిరి, ఆ మేరకు షేర్ల బదిలీకి షర్మిల ప్రయత్నించింది. అలా చేస్తే బెయిల్ కండిషన్ల ఉల్లంఘన ప్లస్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల అక్రమ బదిలీ అవుతుంది. అసలే కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు. తన బెయిల్ రద్దు చేసే కుట్ర ఏదో జరుగుతోందనని, షర్మిల వాళ్ల చేతుల్లో పావు అవుతోందని జగన్ సందేహం, ఆందోళన. అందుకే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశాడు.. ఇదంతా జగన్ వర్గాల వాదన. Also Read: ఇరాన్ సైనిక బలగాలపై ఇజ్రాయెల్ దాడులు! ఇదిలా ఉండగా గురువారం విజయనగరం వెళ్లిన జగన్, ఆస్తుల వ్యవహారాన్ని సింపుల్గా తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలు అందరి ఇళ్లలో ఉన్నదేనంటూ ప్రజలకు కొత్త సందేశాన్ని ఇచ్చారు. మరి బెయిల్ రద్దు వ్యవహారం కూడా చాలా మంది ఇళ్లలో ఉన్నదేనని ఎందుకు తీసుకోలేపోతున్నారు? అన్నదే అసలు పాయింట్. మొత్తానికి జగన్ భయం వెనుక ఏదో సంకేతాలు ఉన్నాయనేది సుస్పష్టం. భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2016లో ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల పంపకం 2019లో జరిగిందని జగన్, షర్మిల చెబుతున్నారు. ఇది బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో బెయిల్ రద్దు అయ్యి.. జగన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి