జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న వేళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌పై ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ కంపెనీలో జరిగే అవకతవకలపై ప్రభుత్వం ఓ కన్నేసిందని, త్వరలో సీఐడీ విచారణకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. By Kusuma 28 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న వేళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌పై కీలక విషయాలు బయటకొస్తున్నాయి. సరస్వతి కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ వెనుక జరిగిన అవకతవకలపై త్వరలో సీఐడీ విచారణకు ఆదేశాలిచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల సరస్వతి పవర్ ఇండస్ర్టీస్‌పై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ పెట్టారు. ఆ కంపెనీకి సంబంధించిన 1500 ఎకరాల భూముల్లో ప్రభుత్వ భూములున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో వీటిపై సర్వేచేయాలని అధికారులను ఆదేశించారు. ఇది కూడా చూడండి: ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం..మార్కెట్లోకి స్విగ్గీ ఐపీఓ ఎంట్రీ? కాలుష్య మండలిని పవన్ ఆదేశించినట్లు.. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. అందులో కొంత ప్రభుత్వ, కొండ పోరంబోకు, చుక్కల భూములు ఉన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో దీనికి సంబంధించిన పూర్తి నివేదికను పవన్‌కు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సరస్వతి కంపెనీకి చెందిన పర్యావరణ అనుమతులపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుమతులు ఎలా పొందారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని పవన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై అటవీ, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం. ఇది కూడా చూడండి: ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి! పేదల జీవితాలు బలిపెట్టి అడ్డదారుల్లో 10 వేల కోట్ల రూపాయల సంస్థకు అధిపతి అయ్యారని ఆరోపించారు. వైఎస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్ల రూపాయలకు పైగా జగన్ దోపిడీ చేశారన్నారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ అక్రమాలపై 2008 నుంచే వ్యక్తిగతంగానూ ఆయన పోరాటం చేస్తున్నారు. జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కి పల్నాడు జిల్లాలోని మాచవరం, దాచేపల్లి మండలాల్లో కొన్ని వందల ఎకరాల పరిధిలో అత్యంత విలువైన సున్నపురాయి నిల్వలను, ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ధారాదత్తం చేయడంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు వెల్లడైంది. జగన్ సీఎం అయ్యాక నిబంధనలను చరమగీతం పాడి సొంత కంపెనీకి మరింత లాభం చేకూర్చారని తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్...! జగన్ తల్లి విజయలక్ష్మీపై ఎన్‌సీఎల్‌టీలో ఇటీవల కేసు దాఖలైంది. దీంతో ఆ కంపెనీకి సున్నపురాతి నిక్షేపాల కేటాయింపు నుంచి ఇప్పటివరకు జరిగిన ఉల్లంఘనలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతుల నుంచి కారుచౌకగా భూములు కొని, ప్రభుత్వం నుంచి అడ్డగోలుగా గనుల లీజు పొంది 15 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించని జగన్... అటు పర్యావరణ మంత్రిత్వశాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకుంటున్న విషయం అధికారుల పరిశీలనలో బయటపడింది. ఇది కూడా చూడండి: Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే! #ys sharmila jagan land issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి