Ap: స్వరూపానందపై విచారణ..? షాక్‌ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

జగన్‌ గురువు స్వరూపానందకు కూటమి సర్కారు షాక్‌ ఇచ్చింది. విశాఖలోని శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

New Update
Sarada Peetha Swarupanandendra

Ap News: జగన్‌ గురువు స్వరూపానందకు కూటమి సర్కారు షాక్‌ ఇచ్చింది. సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.  ముఖ్యంగా విశాఖలోని శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ఆయన గురువు స్వరూపానేంద్ర స్వామిజీ కోరిన కోరికలను తీర్చారని ఆరోపణలు ఉన్నాయి.

Also Read:  ప్రముఖ నిర్మాత శివరామకృష్ణ మళ్లీ అరెస్ట్..

భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో సముద్రతీరంలో ఉన్న 15 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం విశాఖ శారదా పీఠానికి అప్పగించింది. ఒక ఎకరా భూమిని కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని ఆ భూమిని శారదా పీఠానికి ఇచ్చేసింది. భీమిలి సమీపంలోని ప్రాంతంలో ఒక ఎకరా భూమి రూ. 15 కోట్లకు పైగా ఉందని అధికారులు అంటున్నారు. అలాంటిది ఒక ఎకరా భూమి ఒక లక్ష రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో టీడీపీ, జనసేనతో పాటు స్థానికులు తీవ్రంగా ఆక్షేపించారు.

Also Read:  కొత్తగా పెళ్లయ్యిందా.. ఈ మూడు పాటించాల్సిందే!

 అయినప్పటికీ సీఎం జగన్‌ ఇవేవీ లెక్కచేయకుండా తన గురువుకు ప్రభుత్వ భూములు కేటాయించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ శారదా పీఠానికి సంబంధించిన భూముల విషయంపై దృష్టి సారించింది. విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని స్థానికులు కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులతో విచారణ చేయించింది ప్రభుత్వం. స్థానికంగా ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరా భూమి రూ. 15 కోట్లు ఉందని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.

Also Read:  అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. ఫ్యాన్స్ అంతా ఒక్కటే

స్వామీజీ అక్రమాలపై విచారణ..

వాణిజ్య, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోని భూములు తీసుకోగా జీవోలో మాత్రం వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల విస్తరణకు అని రాయడం గమనార్హం. అయితే ఇక్కడ పీఠం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వానికి.. స్వరూపానంద వారసుడు, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రతో 2023 నవంబరు 20న ఓ లేఖ రాయించారు. తమ పీఠానికి ఆదాయం సమకూర్చుకోవడానికి ఆ భూముల్ని వాడుకోవాలన్నది తమ ఉద్దేశమని స్పష్టం చేస్తూ… దానికి వీలు కల్పిస్తూ జీఓను సవరించాలని కోరుతూ… సీఎంగా ఉన్న జగన్ కు లేఖ రాసారు.

Also Read: ఫ్రిడ్జ్‌లో ఇవి స్టోర్ చేసి తింటున్నారా? జాగ్రత్త

పీఠం కార్యకలాపాలకు అవసరమైన ఆదాయాన్ని ఆర్జించడం కోసం సాగర తీరంలో, వాణిజ్య, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలోని భూములు కేటాయించాల్సిందిగా కోరినట్టు అందులో ప్రస్తావించారు. ఆ లేఖ వచ్చిన వెంటనే.. అనేక వెసులుబాట్లు కల్పిస్తూ, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2024 ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం జీవోని సవరించి విడుదల చేసింది. ఆ భూముల్లో ఓ స్టార్ హోటల్ ను నిర్మించాలని సాములోరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పనులు కూడా మొదలైనట్లు సమాచారం.

అయితే జగన్‌, స్వరూపానంద మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్లు కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వరూపానంద అక్రమాలపై విచారణ జరిపించాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబును, పవన్‌కల్యాణ్‌ను మంత్రులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. త్వరలో విచారణకు సంబంధించిన ఆదేశాలు వెలువడనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు