Liquor Bottels: చూస్తూ ఆగలేకపోయాం..సారీ సార్‌!

ఎన్నికల సమయంలో దొరికిన మద్యం సీసాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గుంటూరు పోలీసులు చేపట్టారు. ఎప్పుడూ రోడ్డు రోలర్‌ తో చేసే పనిని ఈ సారి ప్రొక్లెయిన్‌ తో మొదలు పెట్టారు. దీంతో కార్యక్రమం ఆలస్యంగా నడుస్తుండడంతో అక్కడికి వచ్చిన మందుబాబులు పోలీసులు చూస్తుండగానే సీసాలను ఎత్తుకుపోయారు.

author-image
By Bhavana
New Update

Liquor Bottels: ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుంటే మందుబాబులు చూస్తూ ఆగలేకపోయారు. ఏకంగా పోలీసుల సమక్షంలోనే వాటిని తీసుకుని పారిపోయారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా రూ. 50 లక్షల విలువ చేసే 24, 031 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్ ఆధ్వర్యంలో నల్ల చెరువులోని డంపింగ్‌ యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. 

దీంతో యార్డు పరిసరాల్లోని మందుబాబులకు ప్రాణం పోయినంత పనైంది. ఎప్పుడు వాటిని తీసుకొని పారిపోదామా అని ఎదురు చూశారు. సాధారణంగా రోడ్డు రోలర్‌ తో సీసాలను ధ్వంసం చేస్తుంటారు. కానీ ఈసారి పొక్లెయిన్‌ తీసుకురావడంతో సీసాలను పగలగొట్టడానికి సమయం పట్టింది.

వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఉన్నతాధికారులు బయల్దేరి వెళ్లిపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా..వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు. బాటిళ్లను పగలగొడుతుంటే చూస్తూ ఆగలేకపోయాం సార్‌…అని కొందరు మందుబాబులు పోలీసులతో చెప్పడం విశేషం.

Also Read: మానవతా జోన్ పై ఇజ్రాయేల్ విమానదాడులు.. 40 మంది మృతి 

Advertisment
Advertisment
తాజా కథనాలు