/rtv/media/media_files/2025/04/12/suCEoS1ssPb1IAW4VwuC.jpg)
Ontimitta Sitarama Kalyanam
Ontimitta Kodandaramundu : ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పదిన్నర గంటలకు రథోత్సవం నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత కోదండరామయ్య రథంపై విహరించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.
Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కాగా నిన్న రాత్ని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. వాహన సేవలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
శుక్రవారం పండు వెన్నెల్లో శ్రీకోదండరాముని కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవ సందర్భంగా కోదండ రామాలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఏకశిలా నగరంగా పేరొందిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనం అశేషంగా తరలివచ్చారు.
Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!