TDP VS Janasena: ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన మధ్య వార్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత పెట్టిన వీడియో కూటమి నేతల మధ్య మంట పెట్టింది.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదో చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. By Bhavana 29 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TDP VS Janasena: ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు.. అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ, అక్కడక్కడా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్ ఎదుటే.. టీడీపీ, జనసేన నాయకులు ఘర్షణ పడ్డారు. నిడదవోలు మండలంలో జనసేన నేతలు తమకు అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదంటూ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలోనే టీడీపీ నేతలు.. జనసేన వారితో ఘర్షణకు దిగారు. అయితే తాజాగా మరో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత పెట్టిన వీడియో కూటమి నేతల మధ్య మంట పెట్టింది. Also Read: అమెరికాలో ఆ పార్టీ ఓట్లు ట్రంప్ కే! కొల్లేరును నాశనం చేయాలని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామానికి చెందిన టీడీపీ నేత సైదు గోవర్ధన్ ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదో చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. కొల్లేరును నాశనం చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారా అనే దానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. Also Read: చిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం జనసేన నేత వెంకటలక్ష్మి కొల్లేరులోని వైసీపీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించారని.. దొంగలను పార్టీలో చేర్చుకుంటుంటే పవన్ ఏం చేస్తున్నారంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో జనసేన నేతల కారణంగా కొల్లేరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారిని అడ్డుకుంటానని వీడియో రిలీజ్ చేశారు. Also Read: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ ఈ వీడియో స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత సైదు గోవర్థన్‌ను శిక్షించాలని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. సైదు గోవర్ధన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్న జనసేన నేతలు.. తక్షణమే ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దెందులూరులో ర్యాలీ నిర్వహించారు. Also Read: బానిస బతుకులు బతుకుతున్నాం..! నియోజకవర్గంలో ఎవరి అండ చూసుకొని టీడీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో.. ఇలా టీడీపీ, జనసేన పార్టీల మధ్య మంటపెట్టింది. మరి ఈ విషయం జిల్లా నేతల వరకూ వెళ్తుందా.. సమస్యను పరిష్కరిస్తారా అనేది చూడాలి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి