ఏపీలో ED రమేష్ ఎవరు? మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై ఈడీ దాడులు తమ బాసే చేయించారని వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఎంపీ CM రమేష్ అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే.. ED బూచి చూపించి MVV నుంచి 'పీక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను లాక్కున్నారని విశాఖ TDP, YCP నేతలు ఆరోపిస్తున్నారు. By Nikhil 24 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై ఇటీవల ఈడీ దాడులు కొత్త చర్చకు దారి తీశాయి. ఈ దాడులు వెనుక ఎవరున్నారు అన్న అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ దాడులు జరిగిన తర్వాత వివాదాస్పద వ్యాపారవేత్త లింగమనేని రమేష్ అనుచరులు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనుచరులు ఈ సోదాలు తమ బాస్ పుణ్యమేనని చెప్పుకుంటున్నారు. ఈ ఈడీ దాడుల క్రెడిట్ కోసం ఇద్దరు రమేష్ లు పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? ఎవరిప్రోద్బలంతో ఈ రైడ్స్ జరిగాయి? అన్న అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో అసలు ఎవరి ప్రోద్బలంతో ఈ ఈడీ దాడులు జరిగిందో తెలియక వైసీపీ నేతలు బుర్ర గోక్కుంటున్నారు. మొత్తానికి ఈడీ బూచి చూపించి ఎంవీవీ సత్యనారాయణ చేతుల్లో నుంచి 'పీక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను బలవంతంగా లాక్కున్నారని విశాఖకు చెందిన వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. Also Read: RTV Exclusive: ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా?: జగన్ కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్! ఈ నెల 19న దాడులు ఇదిలా ఉంటే.. ఈ నెల 19న విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ టార్గెట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై ఈ సోదాలు చేసినట్లు ఈడీ తెలిపింది. రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాల ‘హయగ్రీవ’ భూమి అన్యాక్రాంతం కావడంపై దర్యాప్తు చేపట్టింది. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల కోసం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించినట్లు తెలిపింది. అయితే.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, మేనేజింగ్ పార్ట్‌నర్ గద్దె బ్రహ్మాజీ మోసపూరితంగా ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. Also Read: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు! ఇంకా.. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బినామీ లావాదేవీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. ఈ మేరకు అరిలోవ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ నివాసాలు, ఆఫీసుల్లో రైడ్స్ సందర్భంగా బినామీ పట్టాదారు పాసుపుస్తకాలు, డిజిటల్ పరికరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. అయితే.. ఈ డిజిటల్ పరికరాలతోనే ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Also Read: 4.5 కిలోల గోల్డ్..కోట్లలో..ప్రియాంక ఆస్తుల వివరాలివే! Also Read: దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో.. #cm-ramesh #mvv satyanarayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి