AP : బీచ్ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి!
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, విభజన పరిస్థితులు, ఎగ్జిట్ పోల్స్ పై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
పిఠాపురంలో గెలుపుపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ కంటే ముందే.. వికీపీడియాలో పిఠాపురం ఫలితాలు ప్రత్యక్షమైయ్యాయి. నియోజకవర్గం పేజ్‌లో గెలుపు మాదంటే మాదంటూ జనసేన, వైసీపీ నాయకులు యుద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంలో అలర్లు సృష్టించి కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్రలు చేస్తోందని పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ సంచలన ఆరోపణలు చేశారు. రౌడీ షీటర్లు, పోలీస్ కేసులు ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ నియమిస్తోందన్నారు.
ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలోనూ తాను గెలవబోతున్నానన్నారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈసీ సమర్థవంతంగా నిర్వహించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
పిఠాపురంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144సెక్షన్ అమలు చేయనున్నారు. హింస జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానికులు తప్ప ఇతర ప్రాంతాల వారు ఎవరూ ఉండొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. హింస జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డంపింగ్ యార్డ్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కాకినాడ జిల్లా రాజులకొత్తూరు సమీపంలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 19వ తేదిన మహిళ వంటిపై దుస్తువులు లేకుండా కాళ్లు, చేతులు కట్టి చనిపోయిన మృతదేహం లభ్యమైంది. హత్యచేసిన నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన నందిగామ ప్రవీణ్ గా గుర్తించారు.