Manchu Manoj: పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ ... మంచు మనోజ్ వీడియో రిలీజ్

పోలీసులతో రాత్రి జరిగిన ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు.. తాను చట్టానికి లోబడే సహకరించాను అని వీడియో రిలీజ్ చేసారు. అయితే పోలీసులు వచ్చి నాపై దురుసుగా వ్యవహరించారని మంచు మనోజ్ ఆరోపించారు.

New Update
Manchu-Manoj

Manchu-Manoj

Manchu Manoj: పోలీసులతో రాత్రి జరిగిన ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు.. తాను చట్టానికి లోబడే సహకరించాను అని వీడియో రిలీజ్ చేసారు. అయితే పోలీసులు వచ్చి నాపై దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. సీఎం దగ్గర నుంచి వచ్చామని చెప్పి ముందుగా భయపెట్టించే ప్రయత్నం చేశారు. సీఎం గారి పేరు ఎందుకు చెప్తున్నారని పోలీసులను నేను నిలదీశాను. సీఎం గారి బందోబస్తు చూసుకొని వస్తున్నామని మళ్లీ మాట మార్చారు. సైరన్ వేసుకుని రిసార్ట్‌ లో పోలీసుల నానా హంగామా చేశారు.

Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో! 

నేను నా కారులో పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగాను. దానికి ఎస్ఐ అక్కడి నుంచి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. చివరికి సిఐ ఫోన్ చేస్తే.. విషయం మొత్తం చెప్పాను. నా దగ్గర మొత్తం అన్ని రికార్డులు ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. యూనివర్సిటీ ముందు ఉన్న వాళ్ల కోసం నేను పోరాటం చేస్తున్నాను. విద్యార్థులకు న్యాయం చేయమని పోరాటం చేస్తున్నాను. వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏమి చేయట్లేదు అని మనోజ్ అందులో పేర్కొన్నారు.

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

కాగా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ‌త కొన్ని నెల‌లుగా ఏం జ‌రుగుతుందో మీ అంద‌రికి తెలుసు. ఈ విష‌యంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టి ఉంటే మ‌మ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఈ స‌మ‌స్య నా ఒక్కరిదే కాదు. నా స్టూడెంట్స్ కావచ్చు.. లేదా మా కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రజల కోసం కావచ్చు వారి కోసమే ఈ పోరాటం. నేను అంద‌రి కోసం పోరాడుతుంటే నా మీదా అటాక్‌లు చేస్తూ.. త‌ప్పుడు కేసులు పెడుతూ.. నా కుటుంబ స‌భ్యుల‌ను ఇందులోకి లాగుతూ.. ఒక మ‌నిషిని ఎన్ని విధాలుగా నాశ‌నం చేయాలో అన్ని చేస్తున్నారు. ఇవన్ని చూసి నేను భ‌య‌ప‌డతాను అనుకుంటున్నారేమో.. అది ఈ జ‌న్మలో జ‌ర‌గ‌దు అంటూ మ‌నోజ్ చెప్పుకొచ్చాడు.


Also Read: Vizag Lorry Incident: విశాఖలో లారీ భీభత్సం.. పార్కులోకి దూసుకెళ్లడంతో..


టాలీవుడ్ యువ నటుడు, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ సోమవారం రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో కనిపించిన విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. తండ్రి మోహన్ బాబు(Mohan Babu), సోదరుడు మంచు విష్ణు(Manchu Vishnu)లతో నెలకొన్న ఆస్తి వివాదంలో మనోజ్ ఒంటరి పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలో మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ విషయంలో నెలకొన్న వివాదం పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే.  

Also Read :  దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

ప్రస్తుతానికి జల్ పల్లి వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతుండగా… మనోజ్ తిరుపతికి షిఫ్ట్ అయిపోయాడు. సంక్రాంతి పండగకు అంటూ మోహన్ బాబు, విష్ణులు కూడా తిరుపతి సమీపంలోని తమ సొంతూరు రంగంపేటకు చేరారు.ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ… జల్ పల్లి నుంచి మోహన్ బాబు వర్సిటీకి షిఫ్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి మనోజ్ తిరుపతి సమీపంలోని భాకరాపేట పోలీస్ స్టేషన్ లో కనిపించారు. ఈ ఫొటోలు చూసి మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారా? అంటూ అంతా ఆశ్యర్యానికి గురయ్యారు.

Also Read :  ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ..

అయితే ఈ ఘటన వివరాల్లోకి వెళితే,.. పోలీసులేమీ మనోజ్ ను అరెస్ట్ చేయలేదట. మనోజే భాకరాపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి రచ్చరచ్చ చేశారని వార్తలు వచ్చాయి. భాకరాపేట పీఎస్ లిమిట్స్ లోని ఓ రిసార్ట్ లో మనోజ్ ఉంటున్నారట. మనోజ్ వెంట బౌన్సర్లూ ఉన్నారట. రాత్రి వేళ గస్తీకి వెళ్లిన పోలీసులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న బౌన్సర్లు కనిపించగా… వారిని పోలీసులు ఆరా తీశారట. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యి తన బౌన్సర్లనే ఆరా తీస్తారా? తననే అవమానిస్తారా? అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ నిరసనకు దిగారట. ఉన్నతాధికారులు వచ్చి తనకు సమాధానం చెబితే తప్పించి అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారట. ఈ క్రమంలో ఆయన అక్కడ రాత్రి 11 గంటల నుంచి 1 గంట దాకా పోలీస్ స్టేషన్ మెట్ల మీదే కూర్చున్నారట. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఆయనకు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట. దీనికి సంబంధించి మనోజ్‌ వీడియో విడుదల చేశాడు.

Also Read :  ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు.. 20 రాష్ట్రాల CMలు, 50 మంది సెలబ్రెటీలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment