ఒకేసారి గాల్లోకి 5500 డ్రోన్లు.. దేశంలోనే ఏపీలో అతిపెద్ద డ్రోన్ షో

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబోతున్నారు. విజయవాడలోని పున్నమి అలాగే భవాని షూట్ లలో ఈరోజు, రేపు డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో ఒకేసారి 5500 డ్రోన్లు మనకు కనిపించబోతున్నాయి.

New Update
drone

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే డ్రోన్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందడానికి డ్రోన్‌ సదస్సు నిర్వహించాలని అన్నారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో సోమవారం డ్రోన్‌ కార్పొరేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఇది కూడా చదవండిః మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

డ్రోన్‌ సదస్సులో యువత, విద్యార్థులు భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటి టెక్నాలజీ యుగంలో డేటా అనేది గొప్ప సంపదని అన్నారు. డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. అంతేకాకుండా పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. ఇవి మాత్రమే కాకుండా విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణ, దోమల నివారణ, రహదారుల పర్యవేక్షణలో డ్రోన్లను వినియోగించుకోవచ్చని చంద్రబాబు అన్నారు.

ఇది కూడా చదవండి:  రేవంత్‌ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?

ఇందులో భాగంగానే దేశంలో నేడు అతిపెద్ద డ్రోన్ షో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కృష్ణానది తీరంలో ఈ డ్రోన్ షో నిర్వహించబోతున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. అమరావతి రాజధానికి ఐకానిక్ ట్రేడ్ మార్క్ తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ పరంగా మరింత ముందుకు దూసుకుపోవాలని చూస్తున్నారు. 

దాని ఉద్దేశంతోనే నేడు, రేపు విజయవాడలో డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ ను విజయవాడలోని పున్నమి ఘాట్ సమీపంలో సీకే కన్వెన్షన్లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ డ్రోన్ సమ్మిట్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. 

Also Read:  కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

గాల్లో ఒకేసారి 5500 డ్రోన్లు 

సాయంత్రం 6 గంటలకు పున్నమి, భవాని ఘాట్లలో సుమారు 5500 డ్రోన్లు ఒకేసారి గాల్లో ఎగరనునన్నాయి. కాగా ఇలా ఒకేసారి 5500 డ్రోన్లు కనిపించడం దేశంలో ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అదే సమయంలో దాదాపు అరకిలోమీటర్లకు పైగా డ్రోన్లు ఆకాశంలోకి వెళ్లి చుట్టు పక్కల ఆకృతులు ప్రదర్శించబోతున్నాయి. 

ఇది కూడా చదవండి: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

దీని కారణంగా డ్రోన్ల అవసరాలు, భవిష్యత్తులో ఏ ఏ రంగాలలో వీటిని ఎలా ఉపయోగించుకోవాలో అనే అంశాలపై మంగళగిరిలోని సికె కన్వెన్షన్ లో డ్రోన్ సబ్మిట్ నిర్వహించనున్నారు. ఇక ఈ డ్రోన్ షో చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వేల సంఖ్యలో రాబోతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు