Chandrababu : టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. లడ్డూ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక సీఎంకు అందజేయనున్నారు. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియపై చర్చించనున్నారు.

author-image
By V.J Reddy
New Update
CHANDRABABU

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. లడ్డూ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక సీఎంకు అందజేయనున్నారు. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియపై చర్చించనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో వివరించనున్నారు. మహాసంప్రోక్షణ చేయాలా లేక మహా శాంతియాగం, శాంతియాగం, సంప్రోక్షణ చేయాలన్న దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరో 12 రోజుల్లో బ్రహ్మోత్సవాలు  ప్రారంభంకాబోతున్నాయి. అంతలోపే నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో సర్కార్, టీటీడీ ఉంది. మరోవైపు లడ్డూ వివాదంపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కూటమి, వైసీపీ నేతల మాటల యుద్ధం నడుస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని సర్కార్ స్పష్టం చేసింది. అంతా రాజకీయ కుట్ర అని వైసీపీ మండిపడుతోంది.

Also Read :  పాఠశాలలే లక్ష్యంగా దాడులు..22 మంది మృతి!

చంద్రబాబు చెప్పిన మాట..

సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ తయారీ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చంద్రబాబు ఏం అన్నారు?.. ఇటీవల తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్ కలిపారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడారని అన్నారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమన్నారు.

Also Read :  ఊహించని ఎలిమినేషన్..! నైనిక, సీత అవుట్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు