BIG BREAKING : CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

New Update
CHANDRABABU

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

సముద్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో, అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ. 286 కోట్లను విడుదల చేయనుంది. ఈ లబ్ధిదారుల అకౌంట్లలోకి మే 19 వ తేదీ నుండి నేరుగా  నగదు జమ కానుంది. గతంలో కేవలం రూ. 10,000 గా ఉన్న ఈ సహాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 20,000 కి పెంచిన సంగతి తెలిసిందే. మే 19న డబ్బులు పడగానే లబ్ధిదారులు egsws.ap.gov.in పోర్టల్ ద్వారా తమ పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 61 రోజులు

సముద్ర జీవసంపద పెంపుదల, చేపల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఏటా వేసవి కాలంలో ప్రభుత్వం వేట నిషేధాన్ని విధిస్తుంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు (మొత్తం 61 రోజులు) సముద్రంలో యాంత్రిక, మోటారు బోట్లతో వేట సాగించడాన్ని పూర్తిగా నిషేధించారు. కేవలం సాంప్రదాయ పడవల (సాధారణ చిన్న బోట్లు) ద్వారా తీరానికి సమీపంలో వేటాడే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఈ ఏడాది కూడా అర్హులైన వారందరికీ ఈ సాయం అందనుంది.

ఈ 61 రోజుల వేట నిషేధ సమయంలో నిబంధనలు అతిక్రమించి సముద్రంలోకి వేటకు వెళ్లే వారిపై మత్స్యశాఖ కఠినంగా వ్యవహరించనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5,000 జరిమానా విధించడమే కాకుండా, వారి వలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.సదరు బోటు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తారు. అంతేకాకుండా, నిబంధనలు మీరిన వారికి ఈ మత్స్యకార భరోసా సహాయాన్ని నిలిపివేస్తారు. బోట్లకు అందించే డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ. 9 కి పెంచడం ద్వారా మత్స్యకారులకు ప్రభుత్వం అదనపు ఊరటనిస్తోంది. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూ. 10 లక్షలకు పెంచింది. 

Advertisment
తాజా కథనాలు