/rtv/media/media_files/ot8kMboXt8zlgnChyhUd.jpg)
వేట్లపాలెం బాణసంచా ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడంతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. దోషుల ఆస్తులను జప్తు చేసి, వారికి జీవితఖైదు పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద బాధిత కుటుంబాలను సామర్లకోట ఆసుపత్రి వద్ద పరామర్శించిన ముఖ్యమంత్రి. శోకసంద్రంలో ఉన్న మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు గారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి. pic.twitter.com/KyORTXJQm1
— D S G RAJU #YuvaGalam #iTDP (@DSGRAJU1) February 28, 2026
మరోవైపు ఈ ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్ధిక సాయం ప్రకటన.#PMModi#CrackerUnitBlast#Vetlapalem#KakinadaBlast#NTVTelugupic.twitter.com/PErHLFH5BN
— NTV Telugu (@NtvTeluguLive) February 28, 2026
ఇద్దరు కుమార్తెలు ఏడుపు
ప్రమాదం జరిగిన చోట పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. తమ వారు ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు హాహాకారాలు చేస్తున్నారు. "మా అమ్మ నూకళ్ల దేవి కనిపించడం లేదు" అంటూ ఆమె ఇద్దరు కుమార్తెలు ఘటనా స్థలంలో ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. పేలుడులో మృతుల సంఖ్య 21కి చేరింది. చనిపోయిన వారిలో అత్యధికులు మహిళా కార్మికులే ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఈ బాణాసంచా పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని ఆర్‌డీవో వెల్లడించారు. నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది.
Follow Us