అంతా తూచ్.. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా : సీఐ సంచలన ప్రకటన

పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు అధికారులు. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని నాటకం ఆడారని తెలిపారు.  పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు.  

New Update
Posani Krishna Murali

పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు అధికారులు. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని అనారోగ్యమంటూ  నాటకం ఆడారని తెలిపారు.  పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు.  రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా కడప రిమ్స్‌లో కూడా పరీక్షలు చేయించామని తెలిపారు.  పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం  చేశారు.  దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని వెల్లడించారు. 

Also Read :  అలెర్ట్.. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ !

అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు

రాజంపేట సబ్  జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ముందుగా వార్తలు వచ్చాయి. వెంటనే జైలు అధికారులు సబ్ జైలు నుంచి ఆయన్ను  రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారని,  అక్కడ వైద్యులు చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారనేది ఆ వార్తల సరాంశం. కాగా ఛాతి నొప్పితో గతకొంతకాలంగా బాధపడుతున్నారు పోసాని. ఇక పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. పోసానిని కోర్టు రిమాండ్ అనంతరం రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

Also Read :  Height Vs Weight Loss: పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?

జోగినేని మణి  ఫిర్యాదు మేరకు 

కాగా జనసేన నాయకుడు జోగినేని మణి (Jogineni Mani) 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఫిబ్రవరి26వ తేదీన హైదరాబాద్‌లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి పోసానిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Also Read :  ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతు .. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు