/rtv/media/media_files/2026/04/21/amabati-2026-04-21-08-43-01.jpg)
BIG BREAKING: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Amabati Rambabu)పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది. తమ అనుమతి లేకుండా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారని, దీనివల్ల ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది. నిబంధనలను అతిక్రమించి ఆందోళన నిర్వహించారనేది ప్రధాన ఆరోపణ.
తన ఇంటిపై దాడి చేసిన వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని నిరసిస్తూ అంబటి రాంబాబు ఈ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకోవాలని, అలాగే గతంలో కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మేకతోటి సుచరిత నిమ్మరసం ఇచ్చి అంబటితో దీక్ష విరమింపజేశారు.
Also Read: అనసూయపై అసభ్య పోస్టులు.. చంటి అరెస్ట్!
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు
ఈ వివాదానికి మూలం జనవరిలో మొదలైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనవరి 31న పోలీసులు అంబటిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటిపై దాడి కూడా జరిగింది. సుమారు 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన, ఫిబ్రవరి 18న బెయిల్‌పై విడుదలయ్యారు.
Also Read: అలర్ట్.. జూన్ 14లోపు ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే చార్జీలు తప్పవు!
జైలు నుంచి వచ్చాక తనపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే ఈ దీక్షకు దిగాల్సి వచ్చిందని అంబటి పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం నిబంధనల ఉల్లంఘన పేరిట ఆయనపై మరో కేసును చేర్చారు.
Follow Us