Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్సకు బిగ్ షాక్

AP: వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. తన సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్యనేతలతో చర్చలు జరిపిన లక్ష్మణరావు దసరా తరువాత చేరుతారనే చర్చ జోరందుకుంది.

New Update
botsa satya

MLC Botsa Satyanarayana: తన సొంత నియోజకవర్గమైన విజయనగరంలో వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. తన సోదరుడు లక్ష్మణరావు త్వరలో జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు విజయనగర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇందుకోసం లక్ష్మణరావు ఇప్పటికే జనసేన ముఖ్యనేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా దసరా ముందు రోజు లేదా తరువాత ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాజకీయాల్లోకి నో ఎంట్రీ...

తన రాజకీయ భవిష్యత్ కోసమే లక్ష్మణరావు జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్న గత పదేళ్ళ నుంచి తన అన్న బొత్స సత్యనారాయణ వలె రాజకీయాల్లో రావాలని విశ్వా ప్రయత్నాలు చేయగా.. వైసీపీకి మాత్రం అతనికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడుకు వ్యతిరేకంగా  అతను పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని ఓటమిలో ఈయన భాగస్వామ్యం ఉన్నట్లు చర్చ నడించింది. తనకు అనుచరులుగా ఉన్న ఏడుగురు సర్పంచులను జనసేనలోకి పంపి, తద్వారా కూటమి విజయానికి పరోక్షంగా కృషి చేశారనే టాక్ కూడా ఉంది.

పవన్ సమక్షంలో...

కూటమి విజయం కోసం పని చేసిన బొత్స లక్ష్మణరావు ముందుగా టీడీపీలో చేరాలని అనుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు సైలెంట్ గా ఉన్న ఆయన.. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడడంతో పార్టీ మార్పు పై టీడీపీ, జనసేన పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు ప్రచారం నడిచింది. కాగా ఆయన జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సోదరుడు లక్ష్మణరావు జనసేన చేరిక బొత్స సత్యనారాయణకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని.. వైసీపీకి.. బొత్సకు ఇది రాజకీయంగా పెద్ద దెబ్బ అనే గుసగుసలు విజయనగరంలో వినిపిస్తున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment