/rtv/media/media_files/2025/03/10/A2w6RNs0WpsrszTznLeS.jpg)
minister payyavula kesav
AP News :ఏపీ రాజధాని అమరావతి లో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. భూ కేటాయింపులు రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మంత్రి నారాయణ ఆధ్వర్వంలో అమరావతి సెక్రటేరియట్‌లో భేటీ అయిన ఈ కమిటీ.. రాజధానిలో పలు సంస్థలకు గతంలో కేటాయించిన భూములపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో గతంలో131 సంస్థలకు భూములు కేటాయించామని మంత్రి తెలిపారు.
Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
మొత్తం 44 సంస్థలకు 2014-19 సమయంలో భూములు కేటాయించినట్లు తెలిపింది. అయితే వీటిలో 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరో 13 సంస్థలకు మాత్రం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు సబ్ కమిటీ పేర్కొంది. రెండు సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్ మార్చామని తెలిపారు. మరో 16 సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్ మార్పు, విస్తరణపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. 13 సంస్థలకు కేటాయించిన భూముల రద్దుకు నిర్ణయించామని అన్నారు.
Also Read: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు
భేటీ అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలని ఆసక్తి ఉన్న ప్రతి కంపెనీకి భూములు కేటాయిస్తామని చెప్పారు. అయితే గతంలో కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ప్రారంభించని కారణంగా 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నామన్నారు. అమరావతికి లక్షల కోట్లు అవసరం లేదని, సీఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు విక్రయించి రాజధానిని నిర్మిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.గత ప్రభుత్వం కక్ష సాధింపుతో రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడి రాజధానిని పక్కన పడేసిందని నారాయణ విమర్శించారు. అనేక న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి 8 నెలల కాలం పట్టిందన్నారు.48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి ఇప్పటికే ఎంపిక చేసామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత ఆయా సంస్థలు పనులు ప్రారంభిస్తాయి.ఎన్నికల కోడ్ ఉండటంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయిందన్నారు. భూముల కేటాయింపులో గతంలో ఉన్న పాలసీనే కొనసాగిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
Also Read: స్టార్ హోటల్ బాత్రూమ్‌లో రోజా అనుమానస్పద మృతి.. ఎన్నారై డాక్టర్ అరెస్ట్!?
మరో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూరాజధాని కోసం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు.భూముల అమ్మకాలతో మాత్రమే అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ఖజానాపై భారం లేకుండా సీఎం చంద్రబాబు మంచి మోడల్ డిజైన్ చేసారన్నారు. గతంలో జగన్ లక్ష కోట్లు కావాలన్నారు..కానీ లక్ష కోట్లు పెట్టకుండానే రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు.
Also read : ఫ్యామిలీతో వెళ్లి ప్రధానికి కలిసిన ఈటల.. ఆ పదవి ఫిక్స్ అయినందుకేనా?