Ambati Rambabu : మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్... బెయిల్ మంజూరు

మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్‌ 12న నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ఆయనకు రూ.10 వేలతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

New Update
Ambati Rambabu - YCP

Ambati Rambabu - YCP

Ambati Rambabu :  మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్‌ 12న వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంపై నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ఆయనకు రూ.10 వేలతో పాటు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

గత సంవత్సరం నవంబర్‌ 12న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీ నిర్వహించే క్రమంలో అంబటి  తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు నాడు ఆయనపై కేసు నమోదు చేశారు. తాజాగా అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు కొట్టేసింది. అలాగే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలతో పాటు రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది. కాగా తాజా, కోర్టు తీర్పుతో అన్ని ఫార్మాలిటీలు పూర్తయితే అంబటి రాంబాబు ఈరోజు లేదా రేపు  జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
 
 కాగా సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారమే బెయిల్ లభించింది. అయినప్పటికీ అంబటి రాంబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛలో మెడికల్ కాలేజీ పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళన కేసులో ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ కేసులో బెయిల్ రాకపోవడంతో అంబటి జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అ కేసుకు సంబంధించి ఈ రోజు బెయిల్‌ లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

Advertisment
తాజా కథనాలు